News September 23, 2025
కరీంనగర్: శ్రీ గాయత్రిదేవీ అవతారంలో అమ్మవారు

కరీంనగర్ జిల్లా కేంద్రంలోని చైతన్యపురి మహాశక్తి ఆలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు అట్టహాసంగా జరుగుతున్నాయి. నేడు 2వ రోజు శ్రీ మహాదుర్గ అమ్మవారు గాయత్రిదేవి అవతారంలో భక్తులకు దర్శనం ఇస్తున్నారు. అమ్మవారిని పసుపు కొమ్ములతో అలంకరించారు. అమ్మవారి దేవాలయాన్ని సుందరంగా ముస్తాబు చేశారు. అమ్మవారికి ధూపదీప, నైవేద్యాలు సమర్పించారు. అమ్మవారి దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు.
Similar News
News September 23, 2025
KNR: ప్రజావాణికి 318 దరఖాస్తులు

కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ప్రజావాణిలో భాగంగా కలెక్టరేట్ ఆడిటోరియంలో అడిషనల్ కలెక్టర్ లక్ష్మి కిరణ్, మునిసిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వర్లు ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. 318 అర్జీలు రాగా సత్వర పరిష్కారం కోసం వాటిని సంబంధిత శాఖల అధికారులకు బదిలీ చేశారు. పెండింగ్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
News September 23, 2025
కరీంనగర్‌లో POSH చట్టంపై వర్క్‌షాప్

కరీంనగర్‌లో WD&CW ఆధ్వర్యంలో మహిళలపై లైంగిక వేధింపుల నివారణ చట్టం(POSH Act)పై సోమవారం వర్క్‌షాప్ జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ పమేలా సత్పతి పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు, కంపెనీలు, కార్యాలయాల్లో అంతర్గత ఫిర్యాదుల కమిటీ(ICC)ల ఏర్పాటు తప్పనిసరని పేర్కొన్నారు. లైంగిక వేధింపులకు గురైన మహిళలు ఈ కమిటీలకు ఫిర్యాదు చేయాలని, ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచుతామని చెప్పారు.
News September 23, 2025
జమ్మికుంట: సినీ నిర్మాత నిమ్మల సతీష్ మృతి

అమ్మ ప్రొడక్షన్స్ అధినేత, సినీ నిర్మాత నిమ్మల సతీష్ సోమవారం అకాలమరణం చెందారు. హన్మకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో బ్రెయిన్ స్ట్రోక్‌తో ఆయన మృతిచెందినట్లు తెలిపారు. సతీష్ ‘టైంపాస్’, ‘దికాప్’ చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు. ఆయన మృతిపట్ల దర్శకుడు జీఎస్ గౌతమ్ కృష్ణ, హీరో దీక్షిత్, సూర్యతో పాటు సినీ ప్రముఖులు, పాత్రికేయులు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సతీష్ స్వగ్రామం జమ్మికుంట మండలం జగ్గయ్యపల్లి గ్రామం.