News September 28, 2024

కరీంనగర్: సొంతిల్లు ఎవరికో?

image

కరీంనగర్ జిల్లాలో ఇల్లు లేని అర్హులైన పేదలు సొంతింటి కోసం ఎన్నో ఆశలతో ఎదురు చూస్తున్నారు. త్వరలోనే వారి కల నెరవేరనున్నట్లు కనిపిస్తోంది. అక్టోబరు 15 నుంచి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించడంతో లబ్ధిదారుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. మొదటి విడతలో జిల్లాలో నియోజకవర్గానికి 3,500 ఇళ్లు మాత్రమే కేటాయిస్తుండగా దరఖాస్తులు మాత్రం లక్షకు పైగానే వచ్చాయి.

Similar News

News September 29, 2024

KNR: నేడు ఎలక్ట్రికల్ బస్సుల ప్రారంభం

image

నేడు (ఆదివారం) కరీంనగర్ అంబేడ్కర్ స్టేడియంలో ఉదయం 9:30 గం.లకి ఎలక్ట్రికల్ బస్సుల ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు రీజినల్ మేనేజర్ సుచరిత తెలిపారు. ఈకార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఉత్తమ్‌కుమార్ రెడ్డి, ఆర్టీసీ వైఎస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సజ్జనార్ హాజరుకానున్నట్లు పేర్కొన్నారు.

News September 29, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ జగిత్యాలలో బాలసదనం నుండి బాలిక మిస్సింగ్. @ ఎల్లారెడ్డిపేట డే కేర్ సెంటర్లో వృద్ధురాలు మృతి. @ జ్వరంతో బాధపడుతున్న సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్. @ పెగడపల్లి మండలంలో విద్యుత్ వైర్లు తగిలి వ్యక్తి మృతి. @ రుద్రంగి మండలంలో డెంగ్యూ ఫీవర్ తో వ్యక్తి మృతి. @ జగిత్యాల జిల్లాలో ఇద్దరు ఎస్ఐల బదిలీ, ఇద్దరు ఎస్ఐలపై వేటు. @ సిరిసిల్లలో ఘనంగా పోషణ మాసోత్సవం. @ కొండగట్టులో భక్తుల రద్దీ.

News September 28, 2024

కరీంనగర్: కాంగ్రెస్‌పై బండి సంజయ్ హాట్ కామెంట్స్

image

కరీంనగర్ ఎంపీ, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కాంగ్రెస్ ప్రభుత్వంపై హాట్ కామెంట్స్ చేశారు. మూసీ హైడ్రా కూల్చివేతలు, 6 గ్యారంటీలు, మాజీ సర్పంచులకు నిధుల అంశాలే కాంగ్రెస్ కొంప ముంచబోతున్నాయని కీలక వ్యాఖ్యలు చేశారు. హైడ్రా కాంగ్రెస్ తలగొక్కోంటోందని, ప్రభుత్వ తీరుపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని అన్నారు.