News February 7, 2026
కరీంనగర్: సొంతోడికి పోటు.. పగవాడికీ నోటు!

KNRజిల్లాలో ఎన్నికల ఖర్చు తడిసి మోపెడవుతోంది. ఒక్కో ఓటుకు రూ.2వేల నుంచి రూ.5వేల వరకు పంపిణీ జరుగుతుందనే ప్రచారం జోరుందుకుంది. ఛైర్మన్, మేయర్ పదవి ఆశావాహులు, ఆర్థికంగా ఉన్నవారు పోటీచేసే వార్డుల్లో వ్యయం రూ.కోటి వరకు దాటే అవకాశం ఉందని భావిస్తున్నారు. మరో విచిత్రమేమిటంటే.. సొంత పార్టీ అభ్యర్థులను ఓడించేందుకు అసమ్మతి నేతలే ప్రత్యర్థులకు రహస్యంగా ఫండింగ్ ఇస్తున్న పరిస్థితులు జిల్లాలో చర్చనీయాంశమయ్యాయి.
Similar News
News February 21, 2026
పిఠాపురం: అరుదైన వన్యప్రాణికి గాయాలు

పిఠాపురం పాత బస్టాండ్ సెంటర్లో శనివారం అరుదైన పునుగు జాతికి చెందిన మానుపిల్లి ప్రత్యక్షమైంది. పెట్రోల్ బంక్ ఎదురుగా ఉన్న డివైడర్‌పై ఒంటినిండా రక్తపు గాయాలతో కదల్లేని స్థితిలో ఇది పడి ఉంది. జనావాసాల మధ్యకు రావడంతో కుక్కలు వెంబడించి కరిచినట్లు స్థానికులు చెబుతున్నారు. గమనించిన స్థానికులు ఆ అరుదైన జీవిని రక్షించే ప్రయత్నం చేస్తూ అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.
News February 21, 2026
కామారెడ్డి: నేడు అన్ని పాఠశాలల్లో PTA సమావేశం

జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో నేడు తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశం (PTA) నిర్వహించాలని DEO రాజు ఆదేశించారు. ఈ సమావేశంలో ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొనాలన్నారు. విద్యార్థుల ప్రగతి, హాజరు శాతంపై టీచర్లు, తలిదండ్రులు చర్చించాలన్నారు. పదవ తరగతి పరీక్షల నేపథ్యంలో విద్యార్థుల పట్ల ఇంటి వద్ద ప్రత్యేక శ్రద్ధ తీసుకునేలా తలిదండ్రులకు తగిన సూచనలు చేయాలని తెలిపారు.
News February 21, 2026
VKB: సీఎం రేవంత్ పర్యటన.. షెడ్యూల్ ఇదే..

CM రేవంత్ నేడు వికారాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 1:30 గంటలకు హెలికాప్టర్ ద్వారా పట్టణంలోని ఎస్ఏపీ కళాశాల గ్రౌండ్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి అనంతగిరి హరితవల్లి రిసార్ట్స్‌కు వెళ్తారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల వరకు ఉభయ తెలుగు రాష్ట్రాల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల శిక్షణ కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు. శిక్షణ ముగిసిన అనంతరం తిరిగి హైదరాబాద్‌కు బయలుదేరుతారు.


