News December 26, 2025

కరీంనగర్: స్థానిక ఖర్చు.. రికవరీ అయ్యేనా..!

image

స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసి వారం గడిచింది. కొందరు గెలిచారు.. కొందరు ఓడారు. అయితే గెలిచినా.. ఓడినా ఇద్దరిది ఒకే బాధ. డబ్బులు ఎలా రికవరీ చేసుకోవడం. స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అభ్యర్థులు అంచనాలను మించి భారీగా ఖర్చు చేసినట్లు సమాచారం. ఓడిన అభ్యర్థులు డబ్బులు గంగపాలు అనుకుంటే.. గెలిచిన అభ్యర్థులు ఇవి రికవరీ అయ్యేనా అనే ఆలోచనలో పడ్డట్లు తెలుస్తోంది.

Similar News

News December 30, 2025

2025: కడప జిల్లా నేరాల గణాంకాలు ఇవే.! (4/4)

image

✎ CEIR పోర్టల్ ద్వారా రూ1.3 కోట్ల విలువైన 1,155 మొబైల్ ఫోన్లు రికవరీ.
✎ జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన 11 కేసుల్లోని ముద్దాయిలకు జీవిత భైదు, 3 కేసుల్లో 10 ఏళ్లకు పైగా జైలు శిక్ష విధింపు.
మొత్తానికి జిల్లాలో నేరాల శాతం తగ్గిందని ఎస్పీ కార్యాలయం తెలిపింది. వచ్చే ఏడాది కట్టుదిట్టచర్యలతో క్రైం రేటును తగ్గిస్తామని జిల్లా ఎస్పీ నచికేత్ పేర్కొన్నారు.

News December 30, 2025

వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు విజయవంతం: కలెక్టర్

image

సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో, అన్ని శాఖల అధికారుల సమన్వయంతో నిర్వహించిన ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు, ఉత్తర ద్వార దర్శనం కార్యక్రమాలు విజయవంతంగా పూర్తయ్యాయని కలెక్టర్ జితేష్ వి పాటిల్ పేర్కొన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సమర్థవంతమైన ఏర్పాట్లు చేయగలిగామని చెప్పారు. ఈ ఉత్సవాల నిర్వహణలో సహకరించిన జిల్లా యంత్రాంగానికి, భక్తులకు, పాత్రికేయులకు ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.

News December 30, 2025

₹50 లక్షల జాయినింగ్ బోనస్

image

ఇండిగో పైలట్స్ రిక్రూట్మెంట్ స్పీడప్ చేసింది. ₹15లక్షలు-₹25L గల జాయినింగ్ బోనస్‌ను ₹50L వరకు పెంచుతోంది. అయితే బోనస్‌తో పాటు శాలరీ స్ట్రక్చర్, వర్కింగ్ కండీషన్సూ మారాలని ఏవియేషన్ నిపుణులు సూచిస్తున్నారు. ఇక్కడ సరైన లైఫ్ స్టైల్ లేక పైలట్స్ విదేశాలకు వెళ్తున్నారని చెబుతున్నారు. కాగా అలసట, ఒత్తిడి తగ్గించేలా పైలట్లకు వారంలో 48Hrs విరామం ఉండాలన్న కొత్త రూల్‌తో స్టాఫ్ కొరత ఏర్పడింది.