News July 19, 2024
కరీంనగర్: 1,30,709 మంది రైతుల రుణమాఫీ

పంట రుణమాఫీ నిధుల విడుదలను రాష్ట్ర ప్రభుత్వం గురువారం ప్రారంభించింది. ఈ మేరకు ఉమ్మడి జిల్లాలోని 1,30,709 మంది రైతులకు రూ.688.44 కోట్ల పంట రుణమాఫీ నిధులు రానున్నాయి. ఇందులో కరీంనగర్‌లో 37,745 మంది రైతులకు రూ.194.64 కోట్ల నిధులు, జగిత్యాలలో 39,253 మంది రైతులకు రూ.207.99 కోట్లు, పెద్దపల్లిలో 29,725 రైతులకు రూ.149.43 కోట్లు, సిరిసిల్లలో 23,986 మంది రైతులకు రూ.136.36 కోట్ల నిధులను విడుదల చేశారు.
Similar News
News August 26, 2025
మానకొండూర్: కవ్వంపల్లికి బండి సంజయ్ పరామర్శ

కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు, మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ సోదరుడు కవ్వంపల్లి రాజేశం ఇటీవల అకాల మరణం చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం కవ్వంపల్లి ఇంటికి వెళ్లిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆయనను పరామర్శించారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అంజిరెడ్డి కూడా బండి సంజయ్‌తోపాటు ఉన్నారు.
News August 26, 2025
సేవా దృక్పథంతో వైద్య సేవలు అందించాలి: కరీంనగర్ కలెక్టర్

కరీంనగర్‌లోని కలెక్టరేట్ ఆడిటోరియంలో మంగళవారం ప్రైవేట్ ఆసుపత్రుల నిర్వాహకులకు ‘క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్, పీఎన్‌డీటీ చట్టం’పై వర్క్ షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడారు. ప్రభుత్వ, ప్రైవేట్ వైద్యులు ఎవరైనా సేవా దృక్పథంతో పని చేయాలన్నారు. ప్రైవేట్ ఆస్పత్రులు నిబంధనలు పాటించాలని సూచించారు. సాధారణ ప్రసవాలకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు.
News August 26, 2025
KNR: ‘ఇందిరమ్మ ఇండ్ల కోసం కొత్త దరఖాస్తులు స్వీకరించండి’

ఇందిరమ్మ ఇండ్ల కోసం కొత్త దరఖాస్తులను స్వీకరించాలని KNR కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. వివిధ శాఖల జిల్లా అధికారులతో సోమవారం ఆమె సమావేశం నిర్వహించారు. ఇల్లు మంజూరైనప్పటికీ నిర్మాణానికి సుముఖత చూపని లబ్ధిదారుల స్థానంలో అర్హులైన కొత్త దరఖాస్తుదారులకు ఇళ్లను కేటాయించాలని ఆమె సూచించారు. ఇళ్ల నిర్మాణ దశలను ఎంపీడీవోలు ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని కలెక్టర్ ఆదేశించారు.