News May 16, 2024
కరీంనగర్: 18 నుంచి సెమిస్టర్ పరీక్షలు ప్రారంభం
కరీంనగర్‌లోని ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ ఆర్ట్స్ & సైన్స్ కళాశాల (అటానమస్) డిగ్రీ రెండవ, నాల్గవ సెమిస్టర్ పరీక్షలు ఈ నెల 18వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరగనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కల్వకుంట రామకృష్ణ, ఎగ్జామినేషన్స్ కంట్రోలర్ డా. కొత్తిరెడ్డి మల్లారెడ్డి గురువారం తెలిపారు.
Similar News
News January 23, 2025
UGCముసాయిదా పై చర్చించిన మాజీ ఎంపీ
విశ్వ విద్యాలయాల్లో నియామకాలకు సంబంధించి UGC ప్రతిపాదించిన కొత్త నిబంధనలపై చర్చించేందుకు తెలంగాణ భవన్ లో BRS నేతల సమావేశం గురువారం నిర్వహించారు. ఈ సమావేశంలో కరీంనగర్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ లు పాల్గొన్నారు. UGC ముసాయిదా అమల్లోకి వస్తే యూనివర్సిటీలు కేంద్రం గుప్పెట్లోకి వెళ్లే అవకాశం ఉందని నేతలు పేర్కొన్నారు.
News January 23, 2025
పోచంపల్లి: డివైడర్‌ను ఢీకొన్న కారు.. నలుగురికి గాయాలు
కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం ఊటూర్ గ్రామానికి చెందిన వరాల రవి కుటుంబం కారులో వెళుతుండగా పోచంపల్లి వద్ద డివైడర్‌కు ఢీకొన్నారు. కారులో ప్రయాణిస్తున్న నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకున్న108 వాహన సిబ్బంది గాయాలపాలైన నలుగురిని కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
News January 23, 2025
శుక్రవారం కరీంనగర్లో పర్యటించనున్న మంత్రి పొన్నం
రాష్ట్ర రవాణా,బీసీ సంక్షేమ శాఖామాత్యులు పొన్నం ప్రభాకర్ శుక్రవారం కరీంనగర్ లో పర్యటించనున్నారు. ఉదయం 09.00 గంటలకు మార్కెట్ రోడ్ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమంలో పాల్గొంటారనీ మంత్రి క్యాబ్ ఆఫీస్ వర్గాలు తెలిపారు. ఉదయం 10.30 గంటలకు కేంద్ర మంత్రులతో డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ స్టేడియం కాంప్లెక్స్, మల్టీపర్పస్ స్కూల్ పార్కును తదితర అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తారు.