News May 7, 2024
కరీంనగర్: 18-39 ఏళ్ల వారే కీలకం!
కరీంనగర్, పెద్దపల్లి లోక్‌సభ స్థానాల్లో అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేయడంలో యువ ఓటర్లు కీలక పాత్ర పోషించనున్నారు. దీంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు వారిని ప్రసన్నం చేసుకోవడానికి యువ ఓటర్ల పైనే ఎక్కువగా దృష్టి సారిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో సుమారు 29 లక్షల మంది ఓటర్లు ఉండగా.. అందులో 45% పైగా 18-39 ఏళ్లు ఉన్న వారే కావడంతో తమకు అనుకూలంగా మళ్లించుకునే దిశగా తీవ్ర స్థాయిలో కసరత్తు చేస్తున్నారు.
Similar News
News January 18, 2025
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్
@ కోహెడ మండలంలో రేపు పర్యటించనున్న మంత్రి పొన్నం ప్రభాకర్. @ వీణవంక మండలంలో తాటి చెట్టు పైనుండి పడి గీత కార్మికుడికి తీవ్ర గాయాలు. @ ఎండపల్లి మండలంలో ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం. @ మెట్పల్లి పట్టణంలో ప్రయాణికుల దినోత్సవం. @ పెద్దాపూర్ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ పై సస్పెన్షన్ ఎత్తివేత. @ లింగ నిర్ధారణ పరీక్షలు జరిపితే చర్యలు తీసుకుంటామన్న కరీంనగర్ కలెక్టర్.
News January 17, 2025
కాంగ్రెస్ హామీలే ఓటమికి టికెట్: బండి సంజయ్
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై కరీంనగర్ ఎంపీ, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ పలు విమర్శలు చేశారు. కాంగ్రెస్ హామీలే ఓటమికి టికెట్ అని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో చేసిన వాగ్దానాలు తెలంగాణలో కాంగ్రెస్ హామీల మాదిరిగానే పడిపోవడం ఖాయమన్నారు. కాంగ్రెస్ బూటకపు ప్రచారాలు, బూటకపు హామీలతో ఢిల్లీ తప్పుదోవ పట్టదన్నారు.
News January 17, 2025
భీమదేవరపల్లి: ఎస్సైకి తప్పిన ప్రమాదం
భీమదేవరపల్లి మండలం కొత్తపల్లి గ్రామ శివారులో బుధవారం రాత్రి ఓ కారు బోల్తా పడిన విషయం తెలిసిందే. స్థానికుల వివరాలు.. వరంగల్ మిల్స్ కాలనీ ఎస్సైగా పనిచేస్తున్న సురేశ్ కొత్తకొండలోని వీరభద్ర స్వామిని దర్శించుకునేందుకు వెళ్తున్నారు. ఈ క్రమంలో కొత్తపల్లి శివారులో టిప్పర్‌ను తప్పించబోయి.. ఎస్సై ప్రయాణిస్తున్న <<15167764>>కారు పల్టీలు కొడుతూ<<>> పొలాల్లోకి దూసుకెళ్లింది. ఎస్సై క్షేమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.