News October 11, 2025

కరీంనగర్: 277 పెండింగ్ చలాన్ల బైక్ పట్టివేత

image

కరీంనగర్ ట్రాఫిక్ పోలీసులు భారీ జరిమానాలు ఉన్న ద్విచక్ర వాహనాన్ని పట్టుకున్నారు. గోదాం గడ్డకు చెందిన అబ్దుల్ ఖయ్యూమ్‌కు చెందిన బైక్‌కు <<17964893>>277 చలాన్లలో రూ.79,845 జరిమానా <<>>బకాయి ఉన్నట్లు గుర్తించి, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.TS 02 EX 1395 అనే బండికి భారీ జరిమానాలు అనే శీర్షికతో Way2Newsలో కథనం వచ్చిన సంగతి తెలిసిందే. కాగా ఎట్టకేలకు భారీ జరిమానాలు ఉన్న వాహనాన్ని పట్టుకున్నారు.

Similar News

News October 11, 2025

సికింద్రాబాద్-కాజీపేట మధ్య మరో రెండు రైల్వే లైన్లు

image

సికింద్రాబాద్(మేడ్చల్-ఘట్‌కేసర్)-కాజీపేట మధ్య ₹2,837Cr అంచనా వ్యయంతో 3, 4వ రైల్వే లైన్ నిర్మాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ లైన్ మేడ్చల్, యాదాద్రి, జనగామ, HNK మీదుగా 110kms దూరాన్ని కవర్ చేస్తుంది. ప్రస్తుతం ఈ మార్గంలో జర్నీకి 2.5-3 గంటలు పడుతుండగా, లైన్ల నిర్మాణం పూర్తయితే గంట సమయం తగ్గనుంది. రైళ్ల వేగం 130-150km/hకి పెరిగే ఛాన్సుంది.

News October 11, 2025

రోజుకు ఎన్ని లీటర్ల నీళ్లు తాగాలి? ఎక్కువ తాగితే ఏమవుతుంది?

image

పురుషులు రోజుకు 3 లీటర్లు, మహిళలు 2.5 లీటర్ల నీళ్లు తాగాలని ICMR రీసెర్చ్ పేర్కొంది. గర్భిణులు, పాలిచ్చే తల్లులు అదనంగా 0.5 నుంచి 1 లీటర్ వరకు తాగొచ్చని తెలిపింది. నీరు ఎక్కువగా తాగితే మూత్రపిండాలపై ఒత్తిడి పెరుగుతుందని, రక్తంలో సోడియం సాంద్రత తగ్గుతుందని డాక్టర్లు చెబుతున్నారు. ముఖ్యంగా దీర్ఘకాలిక డయాబెటిస్, బీపీ, మూత్రపిండాల వ్యాధులు ఉన్నవారు ఒకేసారి ఎక్కువ నీళ్లు తాగొద్దని హెచ్చరిస్తున్నారు.

News October 11, 2025

ఉత్తరాంధ్రలో అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లండి: చంద్రబాబు

image

అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా ఉత్తరాంధ్రలో చేపడతున్న అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లడంతో విఫలమవుతున్నామని CM చంద్రబాబు వ్యాఖ్యనించారు. విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటుతో పాటు స్టీల్‌ప్లాంట్‌ మూతపడకుండా కాపాడామన్నారు. ముఖ్యంగా IT కంపెనీల స్థాపన, గూగుల్‌ డేటా సెంటర్‌, మిట్టల్‌ స్టీల్‌‌ వంటి కీలక ప్రాజెక్టులు త్వరలో ప్రారంభం కానున్నాయన్నారు. అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రులను ఆదేశించారు.