News August 24, 2024
కరీంనగర్: 9,77,472 రేషన్ కార్డు లబ్ధిదారులకు శుభవార్త

రేషన్ కార్డు ఉన్నవారికి జనవరి నుంచి సన్నబియ్యంతోపాటు రాయితీపై గోధుమలు పంపిణీ చేస్తామని ప్రకటించడంతో వారికి ఊరట కలగనుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో దాదాపు 9,77,472 రేషన్ కార్డులు ఉన్నాయి. చాలామంది లబ్ధిదారులు రేషన్ దుకాణం పంపిణీ చేసే దొడ్డు రకాలను వ్యాపారులకు విక్రయించి.. అధిక ధరలు వెచ్చించి బహిరంగ మార్కెట్‌లో సన్నరకాలను కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ నిర్ణయం వారికి మేలు చేసేలా ఉంది.
Similar News
News March 2, 2026
KNR: ‘ప్రజావాణి దరఖాస్తులు పెండింగ్‌లో ఉంచొద్దు’

సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించారు. దరఖాస్తుల పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజావాణి దరఖాస్తులు పెండింగ్ లో ఉంచొద్దని అన్నారు. ప్రజావాణి కార్యక్రమానికి సోమవారం 345 దరఖాస్తులు వచ్చాయి.
News March 1, 2026
KNR: ఎస్సీ స్టడీ సర్కిల్ ప్రవేశ పరీక్షకు 311 మంది హాజరు

కరీంనగర్ లోని వివేకానంద డిగ్రీ, పీజీ కళాశాలలో ఆదివారం నిర్వహించిన ఎస్సీ స్టడీ సర్కిల్ ఉచిత శిక్షణ ప్రవేశ పరీక్షకు 311 మంది అభ్యర్థులు హాజరైనట్లు ఎస్సీ అభివృద్ధి శాఖ జిల్లా డిప్యూటీ డైరెక్టర్ ఎం.నాగైలేశ్వర్ తెలిపారు. ఫలితాలను హైదరాబాద్‌లోని ఎస్సీ స్టడీ సర్కిల్ వెబ్‌సైట్‌లో వెల్లడిస్తారని, ఎంపికైన వారికి ఫోన్ ద్వారా సమాచారం ఇస్తామన్నారు. ఇతర వివరాలకు ఎస్సీ స్టడీ సర్కిల్లో సంప్రదించాలన్నారు.
News March 1, 2026
ఘనంగా నిర్వహించిన వెటర్నరీ డాక్టర్స్ స్పోర్ట్స్ మీట్

కరీంనగర్లోని తెలంగాణ వెటర్నరీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్పోర్ట్స్ మీట్ జిల్లా వెటర్నరీ డాక్టర్స్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఉద్యోగ రీత్యా ఎంత బిజీగా ఉన్నప్పటికీ క్రీడల్లో పాల్గొనడం సిబ్బందిలో నూతనోత్సాహాన్ని నింపుతుందని పేర్కొన్నారు. TNGO ప్రెసిడెంట్ దారం శ్రీనివాస్ రెడ్డి, JAC కన్వీనర్ TGO ప్రెసిడెంట్ మడిపల్లి కాళిచరణ్, టీన్జీవో సెక్రటరీ లక్ష్మణ్ రావు, కార్యదర్శి అరవింద్ రెడ్డి ఉన్నారు.


