News July 16, 2024
కరీంనగర్: MSC విద్యార్థిని అనుమానాస్పద మృతి

MSC విద్యార్థిని అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన KNR జిల్లా గంగాధర మం.లో జరిగింది. రామడుగు SI సురేందర్ ప్రకారం.. గర్శకుర్తికి చెందిన మాధవి(23) తల్లి లక్ష్మి ఇటీవల పెద్ద కూతురు ఇంటికి వెళ్లడంతో మాధవి ఒంటరిగా ఉంటోంది. ఉదయం పాలు అమ్మే వ్యక్తి వచ్చి పిలిస్తే పలకకపోవడంతో స్థానికులను పిలిచాడు. ఇంట్లోకి వెళ్లిచూడగా ఉరేసుకొని కనిపించింది. దీంతో హత్యా? ఆత్మహత్యా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News February 16, 2026
కరీంనగర్ బల్దియాలో కొలువుదీరనున్న కొత్త పాలకవర్గం

కరీంనగర్ నగరపాలక సంస్థ నూతన సభ్యుల ప్రమాణ స్వీకారం, మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నికకు సర్వం సిద్ధమైంది. సోమవారం ఉదయం 10:30 గంటలకు ప్రమాణ స్వీకారం, మధ్యాహ్నం 12:30 గంటలకు పరోక్ష ఎన్నిక నిర్వహించనున్నట్లు కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ తెలిపారు. ఎన్నికల దృష్ట్యా సోమవారం మధ్యాహ్నం వరకు పౌర సేవలను నిలిపివేశారు. వెబ్‌కాస్టింగ్ ద్వారా ఎన్నిక ప్రక్రియను పర్యవేక్షిస్తామని, కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.
News February 15, 2026
KNR: ‘కమిషనరేట్’ పరిధిలో ఆంక్షలు.. 144 సెక్షన్ అమలు

కరీంనగర్ MCK పరోక్ష ఎన్నికల నేపథ్యంలో కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో 163 BNSS (సెక్షన్ 144) అమలు చేస్తున్నట్లు సీపీ గౌష్ ఆలం తెలిపారు. సోమవారం ఉదయం 6 నుంచి మంగళవారం ఉదయం 6 గంటల వరకు ముగ్గురు అంతకంటే ఎక్కువ మంది గుమిగూడటంపై నిషేధం విధించారు. శాంతిభద్రతల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అత్యవసర సేవలకు మినహాయింపు ఉంటుందని పేర్కొన్నారు.
News February 15, 2026
కరీంనగర్: రేపు ప్రజావాణి రద్దు

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ప్రజావాణి కార్యక్రమాన్ని సోమవారం రద్దు చేసినట్లు కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్, మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్న దృష్ట్యా ఎన్నికల నియమావళి అమలులో ఉన్నట్లు పేర్కొన్నారు. అధికారులంతా ఎన్నికల విధుల్లో నిమగ్నమై ఉన్నందున ప్రతి సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజావాణిని సోమవారం నిర్వహించలేమని చెప్పారు.


