News August 14, 2025

కరీంనగర్: PACSలో నామినేటెడ్ ప్రక్రియ..?

image

<<17399669>>PACS<<>> పాలకవర్గాలను ఎన్నికల ద్వారా కాకుండా నామినేటెడ్ ప్రక్రియతో భర్తీచేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. దీనికోసం ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకువచ్చి ఇంప్లిమెంట్ చేయాలని చూస్తుంది. ఈ ప్రక్రియ పక్కనున్న APలో కొనసాగుతుంది. దీంతో ఎక్కువమంది కాంగ్రెస్ కార్యకర్తలు లబ్ధి పొందే అవకాశం ఉంటుంది. PACS పాలకవర్గాల కాలపరిమితి నేటితో ముగుస్తుంది. ఈ సాయంత్రం కల్లా ఉత్తర్వులు వెలువడే ఆకాశముంది.

Similar News

News August 16, 2025

తిరుపతి: తండ్రి అప్పు తీర్చలేదని కుమార్తె కిడ్నాప్

image

తండ్రి అప్పు తీర్చలేదని కూతురిని వ్యాపారి కిడ్నాప్ చేశాడు. ప్రకాశం(D) చీమకుర్తి(M)కి చెందిన శ్రీనివాసరావు గతంలో బేల్దారి పనులకు తిరుపతి వెళ్లాడు. ఆ సమయంలో ఈశ్వర్ రెడ్డి నుంచి రూ.5లక్షలు అప్పు తీసుకుని తిరిగి ఇవ్వలేదు. దీంతో శ్రీనివాసరావు కూతురిని ఈశ్వర్ రెడ్డి కిడ్నాప్ చేశాడు. శ్రీనివాసరావు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వాళ్లు రంగంలోకి దిగి ఈశ్వర్‌రెడ్డిని కావలి వద్ద పట్టుకున్నారు.

News August 16, 2025

నీటి నిర్వహణ పకడ్బందీగా ఉండాలి: ఖమ్మం అ.కలెక్టర్

image

పాలేరు రిజర్వాయర్‌లో నీటి నిర్వహణ పకడ్బందీగా ఉండాలని అదనపు కలెక్టర్ పి.శ్రీనివాస రెడ్డి తెలిపారు. ఆయన శుక్రవారం పాలేరు రిజర్వాయర్‌ను క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రిజర్వాయర్‌లో ఉన్న నీటి నిల్వ, ఇన్ ఫ్లో ఎంత, ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం ఎంత, తదితర వివరాలను నీటిపారుదల శాఖ అధికారుల నుంచి ఆరా తీశారు.

News August 16, 2025

చింతలపూడి: తమ్మిలేరు ప్రాజెక్టుకు భారీగా వరద

image

తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలకు తమ్మిలేరు ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది. ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో 3,400 క్యూసెక్కులు చేరుకోగా, నీటి మట్టం 344 అడుగులకు చేరింది. దీంతో చింతలపూడి మండలంలోని మూడు గ్రామాలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.