News October 19, 2025
కరీంనగర్: SU డిగ్రీ పరీక్ష ఫీజు నోటిఫికేషన్ విడుదల

SU పరిధిలో BA, B.com, Bsc, BBA కోర్సుల్లో 1వ సెమిస్టర్ పరీక్షల ఫీజు నోటిఫికేషన్ అధికారులు విడుదల చేశారు. దీనిలో భాగంగా అపరాధ రుసుం లేకుండా OCT 27 వరకు, లేట్ ఫీజు రుసుం రూ.300తో OCT 29 వరకు చెల్లించుకోవచ్చని SU పరీక్షలు నియంత్రణ అధికారి డా. సురేశ్ కుమార్ తెలిపారు. మరిన్ని వివరాలకు యూనివర్సిటీ వెబ్ సైట్‌లో చూడాలని లేదా ఆయా కళాశాలలో సంప్రదించాలని సూచించారు. పరీక్షలు NOV 13 నుంచి నిర్వహించనున్నారు.
Similar News
News October 19, 2025
జూబ్లీ బరిలో ఎవ్వరూ తగ్గట్లేదుగా

జూబ్లీహిల్స్ ఉపఎన్నికల నేపథ్యంలో రాజకీయం హీటెక్కుతోంది. వచ్చేనెల 11న జరిగే ఎన్నికల్లో గెలవాలని అధికార పార్టీ, ప్రతిపక్ష బీఆర్ఎస్ ప్రచారం జోరుపెంచాలని నిర్ణయించాయి. కాంగ్రెస్ 40 మందిని ప్రచారానికి స్టార్ క్యాంపెయినర్లను నియమించగా గులాబీ దళం నుంచి 60 మందిని నియమించింది. ఇరు పార్టీలు కీలకనేతలకు ప్రచార బాధ్యతలు అప్పగించాయి. రాష్ట్ర రాజకీయాలు గ్రౌండ్ లెవల్‌కు వచ్చాయనే చర్చ నడుస్తోంది.

నేడు వేములవాడ రాజన్న దర్శనాలపై క్లారిటీ..?

వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి ఈరోజు సాయంత్రం 5 గంటలకు శృంగేరి పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ విధుశేఖర భారతి స్వామి వస్తున్నారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ హాజరుకానున్నారు. ఈ రోజు సాయంత్రం రాజన్న దర్శనంపై స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొద్దిరోజులుగా రాజన్న దర్శనాలపై సందిగ్ధత నెలకొంటున్న విషయం తెలిసిందే.