News November 7, 2025

కరీంనగర్: TASKలో బ్యాంకు కోచింగ్!

image

కరీంనగర్ జిల్లా కేంద్రంలోని TASK ఆఫీస్‌లో బ్యాంకు కోచింగ్ కోసం శిక్షణ ఇవ్వనున్నట్లు టాస్క్ ప్రతినిధులు తెలిపారు. అర్థమేటిక్, రీజనింగ్, ఇంగ్లిష్, బ్యాంకింగ్, కంప్యూటర్, కోఆపరేటివ్ అవేర్నెస్ సబ్జెక్ట్స్‌లో శిక్షణ ఇస్తామన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు KNR IT టవర్ 1st ఫ్లోర్‌లోని TASK ఆఫీస్‌లో ఈనెల 14లోపు సంప్రదించి రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

Similar News

News November 7, 2025

సంగారెడ్డి: ఈనెల 20 నుంచి బడి బయట పిల్లల సర్వే

image

జిల్లాలో ఈనెల 20 నుంచి 31 డిసెంబర్ వరకు బడి బయట పిల్లల సర్వే నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసిందని DEO వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ.. పాఠశాల పరిధిలోని గ్రామాల్లో, ఆవాస ప్రాంతాల్లో 6-14 సంవత్సరాలలోపు బడి బయట ఉన్న విద్యార్థులను గుర్తించి పాఠశాలలో చేర్పించాలని పేర్కొన్నారు. గుర్తించిన విద్యార్థుల వివరాలను ప్రబంధ పోర్టర్లో నమోదు చేయాలని సూచించారు.

News November 7, 2025

పెద్ది నుంచి లిరికల్ కాదు.. వీడియో సాంగ్

image

టాలీవుడ్ ప్రేక్షకులను డైరెక్టర్ బుచ్చిబాబు ‘చికిరి చికిరి’ అంటూ ఊరిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. ఈ సాంగ్ ప్రోమో కూడా రిలీజ్ అయ్యింది. ఫుల్ సాంగ్‌ను ఇవాళ ఉదయం 11.07కి విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే అందరూ అనుకున్నట్లు లిరికల్ సాంగ్‌ను కాకుండా వీడియో సాంగ్‌నే రిలీజ్ చేయబోతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా పెద్ది చిత్రం నిర్మాణ సంస్థ వృద్ధి సినిమాస్ SMలో పేర్కొంది.

News November 7, 2025

నవంబర్ 7: చరిత్రలో ఈరోజు

image

*1858: స్వాతంత్ర్య సమరయోధుడు బిపిన్ చంద్రపాల్ జననం
*1888: భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి, భారత రత్న గ్రహీత సి.వి.రామన్(ఫొటోలో) జననం
*1900: స్వాతంత్ర్య సమరయోధుడు, మాజీ ఎంపీ ఎన్‌జీ రంగా జననం
*1954: నటుడు కమల్ హాసన్ జననం
*1971: డైరెక్టర్, రచయిత త్రివిక్రమ్ పుట్టినరోజు
*1981: హీరోయిన్ అనుష్క శెట్టి బర్త్‌డే
*జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవం