News March 29, 2026

కరెంట్ అఫైర్స్

image

* ముంబై, ఒడిశాల్లో దేశంలోనే తొలి ‘పోర్ట్ ఆఫ్ రెఫ్యూజ్’ ప్రారంభించిన అదానీ గ్రూప్
* జులై 31 వరకు టూవీలర్ EV.. 2028 MAR 31 వరకు ఇ-రిక్ష, ఇ-కార్టులపై సబ్సిడీని పొడిగించిన కేంద్రం
* 2025లో నిరుద్యోగ రేటు 6.5%కు తగ్గిందన్న కేంద్రం. 2024లో నిరుద్యోగ రేటు 7%గా ఉన్నట్లు వెల్లడి.
* 16ఏళ్లలోపు పిల్లలకు SMను నిషేధించిన ఇండోనేషియా
* నేపాల్ పీఎంగా బలేంద్ర షా పగ్గాలు.. యువ ప్రధానిగా (35) రికార్డ్

Similar News

News April 8, 2026

పవన్‌లో కర్మయోగిని చూశా: డైరెక్టర్ బాబీ

image

AP Dy.CM పవన్‌ను డైరెక్టర్ బాబీ కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయనతో కలిసి పనిచేసిన(సర్దార్ గబ్బర్ సింగ్) జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ట్వీట్ చేశారు. ‘ఆస్తులు పెంచుకోవడమే రాజకీయం అనుకునే ఈ రోజుల్లో ప్రజా సేవ కోసం రాజభోగాలను, సుఖాలను వదులుకొని శ్రమిస్తున్న ఋషి పవన్ కళ్యాణ్. జ్ఞానం కోసం అడవికి వెళ్లిన బుద్ధుడిని చరిత్రలో చదివాం. జనం కోసం నిరంతరం తపించే కర్మయోగిని ఇవాళ కళ్లారా చూశా’ అని కొనియాడారు.

News April 8, 2026

హార్ముజ్‌పై టోల్స్ విధిస్తే ఒప్పుకోం: ఒమన్

image

హార్ముజ్ జలసంధిపై టోల్స్ విధించేందుకు అనుమతించాలన్న ఇరాన్ సీజ్‌ఫైర్ డిమాండ్‌ను పొరుగు దేశమైన ఒమన్ తప్పుపట్టింది. అది అంతర్జాతీయ జలమార్గమని దానిపై ఫీజు వసూలు చేయడం సరికాదని ఒమన్ ట్రాన్స్‌పోర్ట్ మినిస్టర్ పేర్కొన్నారు. దీనిపై గతంలో ఒప్పందాలు కూడా కుదుర్చుకున్నట్లు తెలిపారు. కాగా అంతకుముందు హార్ముజ్‌పై టోల్స్‌కు ఇరాన్, ఒమన్ అంగీకరించాయని ఇరాన్ మీడియా పేర్కొంది.

News April 8, 2026

సీజ్‌ఫైర్ వేళ.. UAE, కువైట్‌పై ఇరాన్ దాడి

image

తమ దేశంలోని లవన్ రిఫైనరీపై దాడికి ప్రతీకారంగా UAE, కువైట్‌పై ఇరాన్ విరుచుకుపడింది. మిడిల్ ఈస్ట్‌లోని ఆ రెండు దేశాలపై మిస్సైల్స్‌ ప్రయోగించింది. ఒకవైపు సీజ్‌ఫైర్ అమల్లో ఉండగానే తమపై దాడి జరిగిందని ఇరాన్ చెప్తోంది. అందుకే అమెరికాకు మద్దతిస్తున్న గల్ఫ్ దేశాలపై దాడి చేసినట్లు తెలుస్తోంది.