News October 24, 2025

కరెంట్ షాక్‌కు గురై వ్యక్తి మృతి

image

ఏలూరు రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలోని గన్నవరం రైల్వే స్టేషన్‌లో కరెంట్ షాక్‌కు గురైన గుర్తు తెలియని వ్యక్తి చికిత్స పొందుతూ విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో శుక్రవారం మృతి చెందాడు. ఈనెల 19న గన్నవరం రైల్వే స్టేషన్లో అతను కాక్‌కు గురయ్యాడు. రైల్వే సిబ్బంది అతన్ని విజయవాడ తరలించారు. సమాచారం తెలిసినవారు ఏలూరు రైల్వే పోలీసులను సంప్రదించాలని రైల్వే ఎస్ఐ ఎస్సై శివన్నారాయణ సూచించారు.

Similar News

News October 25, 2025

దూసుకొస్తున్న తుఫాన్.. ఆ జిల్లాల్లో 2 రోజులు సెలవులు?

image

AP: రాష్ట్రానికి ‘మొంథా’ తుఫాన్ ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఈ ఏడాది ఇదే బలమైన తుఫాన్ అని, ఈ నెల 28 అర్ధరాత్రి లేదా 29 తెల్లవారుజామున తీరం దాటే అవకాశం ఉందన్నారు. 26 నుంచి 4 రోజుల పాటు ఏపీకి రెడ్ అలర్ట్ జారీ చేశారు. ముఖ్యంగా 28, 29 తేదీల్లో తీర ప్రాంత జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ఇవ్వాలని అధికారులు సూచించారు. నేడు, రేపు చాలాచోట్ల భారీ వర్షాలు కురవనున్నాయి.

News October 25, 2025

లవ్ మ్యారేజ్ చేసుకుంటా: అనుపమ

image

కెరీర్ ప్రారంభంలో ట్రోల్స్ వల్ల తాను బాధపడినట్లు హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ చెప్పారు. బిగినింగ్‌లో ఓ స్కూల్‌ ఈవెంట్‌కి వెళ్లిన ఫొటోలు వైరలవ్వగా డబ్బులిస్తే పాన్ షాపు ఈవెంట్లకూ వెళ్తారని తనపై ట్రోల్స్ వచ్చినట్లు ఓ ఇంటర్వ్యూలో ఆమె తెలిపారు. లవ్ మ్యారేజ్ చేసుకుంటారా అని ప్రశ్నించగా ఫ్యామిలీ అనుమతితో చేసుకుంటానని ఆమె బదులిచ్చారు. తాను ప్రత్యేకంగా ఎలాంటి డైట్ పాటించనని, నచ్చిన ఫుడ్ తింటానని చెప్పారు.

News October 25, 2025

MBNR-డోన్ రైల్వే సెక్షన్ అప్‌గ్రేడేషన్‌కు ఆమోదం

image

MBNR-డోన్ రైల్వే సెక్షన్‌లో ఆధునిక 2×25 కిలోవోల్ట్ విద్యుత్ ట్రాక్షన్ వ్యవస్థ అమలు చేయడానికి రైల్వే మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్ట్ ద్వారా దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని ఈ మార్గం మరింత శక్తివంతమైన రైల్వే మార్గంగా మారనుంది. ఈ ప్రాజెక్ట్‌కు రూ.122.81 కోట్లు వ్యయం కానుంది. సుమారు 184 కిలోమీటర్ల రూట్ పొడవులో ప్రస్తుతం ఉన్న 1×25 KV వ్యవస్థను 2×25 KV సిస్టమ్‌గా అప్‌గ్రేడ్ చేయనున్నారు.