News March 22, 2025

కర్ణాటక యువకుడి ఆత్మహత్య

image

పరిగి మండల పరిధిలోని జయమంగళి నదీ పరిసరాల్లో కర్ణాటకకు చెందిన రాజేశ్ అనే యువకుడు పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సిబ్బంది కలిసి ఎస్ఐ రంగుడు అక్కడికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. ఘటనా స్థలంలో పురుగు మందు బాటిల్‌తో పాటు కూల్ డ్రింక్ ఉన్నట్లు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News September 15, 2025

గృహ హింస బాధితులకు వరంగల్ పోలీసుల సహాయ హామీ

image

గృహ హింసపై ప్రతి ఒక్కరూ గళం ఎత్తాలని వరంగల్ పోలీస్‌ శాఖ పిలుపునిచ్చింది. బాధితుల హక్కులను కాపాడడంలో సమాజం ముందుకు రావాల్సిన అవసరం ఉందని అధికారులు తెలిపారు. తక్షణ సహాయం కోసం గృహ హింస బాధితులు ఎప్పుడైనా డయల్ 100కు కాల్ చేయవచ్చని, 24 గంటల సహాయానికి పోలీసులు సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు.

News September 15, 2025

MBNR: ప్రజావాణికి 15 ఫిర్యాదులు: ఎస్పీ

image

మహబూబ్‌నగర్ జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఎస్పీ డి.జానకి ప్రజల నుంచి 15 వినతిపత్రాలను స్వీకరించారు. ప్రతి ఫిర్యాదును శ్రద్ధగా పరిశీలించిన ఎస్పీ, సంబంధిత అధికారులతో మాట్లాడి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజావాణి ద్వారా వచ్చిన ప్రతి సమస్యపై నిరంతర పర్యవేక్షణ ఉంటుందని ఎస్పీ తెలిపారు.

News September 15, 2025

నిజామాబాద్: ఈనెల 17న ప్రజాపాలన వేడుకలు

image

ఈ నెల 17న నిర్వహించనున్న ప్రజాపాలన దినోత్సవ వేడుకకు విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి ఆదేశించారు. జిల్లా కార్యాలయంలో నిర్వహించే వేడుకలపై సోమవారం కలెక్టర్ చర్చించారు. వేడుకకు ముఖ్య అతిథిగా సWఎం సలహాదారు నరేందర్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారని చెప్పారు. ప్రజా ప్రతినిధులు, పుర ప్రముకులు రానున్న నేపథ్యంలో లోటు పాట్లు లేకుండా చేయాలన్నారు.