News June 11, 2024

కర్నూలును అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తా: చంద్రబాబు

image

కర్నూలును అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తానని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. విజయవాడలోని ఏ-కన్వెన్షన్ హోటల్‌లో శాసనసభా పక్ష సమావేశం మంగళవారం నిర్వహించారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో టీడీపీ, బీజేపీ నుంచి గెలిచిన 11 మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారు. చంద్రబాబు మాట్లాడుతూ.. గత ప్రభుత్వం కర్నూలును జ్యుడీషియల్ రాజధానిగా ప్రకటించిందని, కానీ ఏమీ చేయలేదని అన్నారు. సీమలో కూటమికి మంచి సీట్లు వచ్చాయని చెప్పారు.

Similar News

News July 9, 2025

మద్దికేరలో ఆక్సిండెంట్.. ఒకరి మృతి

image

మద్దికేరలోని బురుజుల రోడ్డులో రెండు బైకులు ఢీకొని ఒకరు మృతి చెందారు. మృతుడిని కైరుప్పలకు చెందిన తిరుమల యాదవ్(24)గా పోలీసులు గుర్తించారు. గుంతకల్లు మండలం గుళ్లపాలెంలో భార్యను చూసి సొంతూరుకు వస్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై విజయ్ కుమార్ నాయక్ తెలిపారు.

News July 9, 2025

నిషేధిత పదార్థాలను విక్రయిస్తే చర్యలు తప్పవు: ఎస్పీ

image

జిల్లా వ్యాప్తంగా ఉన్న విద్యా సంస్ధల సమీపంలోని 100 గజాల దూరంలో సిగరెట్, పొగాకు సంబంధిత పదార్ధాలు అమ్మడం నిషేధించామని ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. మంగళవారం జిల్లా వ్యాప్తంగా ఆపరేషన్ క్యాంపస్ సేఫ్ జోన్ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని పోలీసులు నిర్వహించారు. నిషేధిత వస్తువులను షాప్ నిర్వాహకులు అమ్మితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని యజమానులకు అవగాహన కల్పించారు.

News July 8, 2025

ఆదోని: సబ్ కలెక్టర్ కార్యాలయంలో ప్రజా గ్రీవెన్స్

image

ఆదోనిలోని సబ్ కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం సోమవారం జరిగింది. సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ ప్రజా గ్రీవెన్స్‌కు వచ్చిన ఆయా గ్రామాల ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని వినతులు స్వీకరించారు. డీఎల్డీఓ బాలకృష్ణారెడ్డి, డీఎల్పీఓ తిమ్మక్క, డిప్యూటీ ఇన్స్‌పెక్టర్ ఆఫ్ సర్వేయర్ వేణు సూర్య, శ్రీనివాసరాజు పాల్గొన్నారు.