News November 7, 2024
కర్నూలులో ఉల్లి ధర పైపైకి..

ఉల్లి ధరలు ఒక్కసారిగా పెరిగాయి. రెండ్రోజుల నుంచి ధరలు ఆశాజనకంగా ఉండటంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కర్నూలులో నిన్న క్వింటా గరిష్ఠంగా రూ.4,849 పలికింది. సరాసరి ధర రూ.3,896తో విక్రయాలు జరిగాయి. జిల్లా నలుమూలల నుంచి దిగుబడిని రైతులు కర్నూలు మార్కెట్‌కు పెద్ద సంఖ్యలో తీసుకొస్తున్నారు. కిలోకు సుమారు రూ.40కిపైగా ధర దక్కుతుండటంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News March 2, 2026
చట్టపరంగా న్యాయం చేస్తాం: ఎస్పీ

ఫిర్యాదుల పరిష్కార వేదికలో స్వీకరించిన ఫిర్యాదులపై చట్టప్రకారం విచారణ జరిపి బాధితులకు న్యాయం చేస్తామని విక్రాంత్ పాటిల్ హామీ ఇచ్చారు. ఎస్పీ ఆఫీసులో నిర్వహించిన కార్యక్రమంలో మొత్తం 103 ఫిర్యాదులు స్వీకరించారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు తీసుకుని మోసాలు, ఆస్తి వివాదాలు, రుణ చెల్లింపుల సమస్యలు తదితర అంశాలపై వచ్చిన వినతులను అధికారులు నమోదు చేసి, తక్షణ చర్యలు తీసుకోవాలని ఎస్పీ ఆదేశించారు.
News March 2, 2026
ఐసీడీఎస్ పనితీరుపై కలెక్టర్ సమీక్ష

కర్నూలు కలెక్టరేట్ సమావేశ మందిరంలో CDPOలు, సూపర్వైజర్లతో ICDS శాఖ పనితీరుపై మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ వేణుగోపాల్ రెడ్డి, కలెక్టర్ ఏ.సిరి ఇవాళ సమీక్షించారు. ప్రజల్లో శాఖపై సానుకూల అభిప్రాయం పెంపు కోసం చర్యలు తీసుకోవాలని సూచించారు. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్న సేవలను మరింత సమర్థవంతంగా అమలు చేయాలన్నారు. లబ్ధిదారులకు పోషకాహారం, గర్భిణులకు అందే సేవలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.
News March 2, 2026
బాల్య వివాహాల నిర్మూలనకు ‘విముక్తి రథం’

కర్నూలు కలెక్టరేట్ ఆవరణలో బాల్య వివాహాల విముక్తి రథాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి, ఐసీడీఎస్ డైరెక్టర్ వేణుగోపాల్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ రథం జిల్లాలోని అన్ని గ్రామాలు, మండలాల్లో పర్యటిస్తూ బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పిస్తుందని వారు తెలిపారు. ఆడపిల్లలను చదువు ద్వారా ప్రయోజకులను చేయాలని, చిన్న వయసులో పెళ్లిళ్లు చేసి వారి జీవితాలను నాశనం చేయవద్దని కోరారు.


