News April 19, 2025
కర్నూలులో క్యాన్సర్ హాస్పిటల్ ప్రారంభం

కర్నూలు ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో శనివారం నూతన క్యాన్సర్ ఆస్పత్రి ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవంలో రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్, మంత్రి టీజీ భరత్‌తో కలిసి ముఖ్యఅతిథిగా పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత పాల్గొన్నారు. అనంతరం నూతన ఆస్పత్రి భవనాన్ని సందర్శించి అక్కడ ఉండే వసతుల గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు ఆమె సూచించారు.
Similar News
News January 28, 2026
నెల్లూరు: రాయితీలు అపారం.. అమల్లో జాప్యం

జిల్లాలో పశువులు 57,774, బర్రెలు 6,46,106, గొర్రెలు 10,95,197, మేకలు 3,86,929 చొప్పున ఉన్న పశు సంపదకు రక్షణ కల్పించేందుకు తీసుకొచ్చిన ఎనిమల్ షెల్టర్స్ పడకేసాయి. జిల్లాకు 2700 షెల్టర్స్ మంజురైతే 800 మాత్రమే పూర్తవ్వగా మిగిలిన 1900 నిర్మాణాలను మార్చిలోగా పూర్తి చేయాల్సి ఉంది. పశువులకు రూ.2.30 లక్షలకు 90% సబ్సిడీ, గొర్రెలు, మేకలకు రూ.2.30 లక్షలు, పౌల్ట్రీ కింద రూ.1.32 లక్షలకు 70% సబ్సిడీ ఇస్తున్నారు.
News January 28, 2026
గన్నవరం చేరుకున్న మోహన్ భగవత్

ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ బుధవారం గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. బెంగళూరు నుంచి ఇండిగో విమానంలో వచ్చిన ఆయనకు విమానాశ్రయ అధికారులు, పోలీసు ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. ఆయన రాకను పురస్కరించుకొని విమానాశ్రయ ప్రాంగణంలో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. అనంతరం ఆయన గన్నవరం నుంచి రోడ్డు మార్గాన విజయవాడ కరకట్టపై ఉన్న గోకరాజు గంగరాజు ఆశ్రమానికి బయలుదేరి వెళ్లారు.
News January 28, 2026
VZM: ‘రాజకీయ పార్టీలు బీఎల్‌ఏలను నియమించాలి’

గుర్తింపు పొందిన జాతీయ, రాష్ట్ర స్థాయి రాజకీయ పార్టీలు తప్పనిసరిగా బూత్ లెవెల్ ఏజెంట్లు (బీఎల్‌ఏలు) నియమించుకోవాలని జిల్లా రెవిన్యూ అధికారి ఈ. మురళి సూచించారు. బుధవారం తన ఛాంబర్‌లో రాజకీయ పార్టీ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. బీఎల్‌ఏల ద్వారా ఓటర్ల జాబితాలో చేర్పులు, మార్పులు, తొలగింపులు, మరణించిన ఓటర్ల వివరాలు సులభంగా గుర్తించవచ్చన్నారు. జిల్లాలో మొత్తం 15,74,815 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు.


