News February 21, 2025
కర్నూలులో జీబీఎస్ కేసు నమోదు

కర్నూలులో తొలి గిలియన్ బార్ సిండ్రోమ్ (జీబీఎస్) కేసు నమోదైంది. నగరంలోని భగత్‌సింగ్‌నగర్‌కు చెందిన గోకారమ్మ (46) అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరగా వైద్యులు పరీక్షలు నిర్వహించారు. జీబీఎస్ ఉన్నట్లు నిర్ధరించారు. దీంతో ఆమెను ప్రత్యేక వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ఈ వ్యాధి అంటువ్యాధి కాదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే.
Similar News
News November 18, 2025
గుప్పిడి పేట: సముద్రంలో తెప్ప బోల్తాపడి మత్స్యకారుడు మృతి

సముద్రంలో తెప్ప బోల్తా పడడంతో మంగళవారం ఉదయం గుప్పిడిపేటకు చెందిన మత్స్యకారుడు మృతి చెందాడు. పోలాకి మండలం గుప్పిడిపేట నుంచి ముగ్గురు మత్స్యకారులతో వేటకు బయలుదేరిన చెక్క రాజయ్య (45) తెప్పపై సముద్రంలోకి వెళుతుండగా బోల్తా పడి మునిగి మృతి చెందాడు. స్థానికులు మృతదేహాన్ని ఒడ్డుకు తీసుకువచ్చారు. మృతునికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.

మలికిపురం: తండ్రి, పిల్లలు అదృశ్యం.. ముమ్మర గాలింపు

మలికిపురం మండలం లక్కవరానికి చెందిన సిరిగినీడి దుర్గాప్రసాద్ (43), అతని కుమారుడు మోహిత్ (14), కుమార్తె చిట్టి (11)తో సహా సోమవారం సాయంత్రం అదృశ్యమయ్యారు. వారి బైకు, ఫోన్ బ్రిడ్జిపై లభించడంతో వారు గోదావరిలో దూకి ఉంటారనే అనుమానంతో గాలింపు చర్యలు చేపట్టామని ఎస్ఐ సురేశ్ మంగళవారం తెలిపారు. వారి ఆచూకీ ఇంకా లభించకపోవడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.