News June 4, 2024
కర్నూలులో టీజీ భరత్ ఘన విజయం
కర్నూలు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా టీడీపీ అభ్యర్థి టీజీ భరత్ ఘన విషయం సాధించారు. వైసీపీ అభ్యర్థి ఏఎండీ ఇంతియాజ్‌పై 19,200 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. వీటికి ఇంకా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు కలపాల్సి ఉండటంతో మెజారిటీ పెరగనుంది. భరత్‌కు 79,183, ఇంతియాజ్‌కు 58,449 ఓట్లు పోలయ్యాయి. దీంతో టీడీపీ కార్యకర్తలు, అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.
Similar News
News January 18, 2025
రాష్ట్రస్థాయి వాలీబాల్ విజేత వైజాగ్ జట్టు
శ్రీశైల మండల కేంద్రమైన సున్నిపెంటలో నిర్వహించిన రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీల్లో వైజాగ్ జట్టు విజేతగా నిలిచింది. సంక్రాంతి పండుగ సందర్భంగా సున్నిపెంట యూత్ ఆధ్వర్యంలో సెంట్రల్ లొకాలిటీ పాఠశాలలో 4 రోజులుగా వాలీబాల్ పోటీలు నిర్వహించారు. రన్నర్‌గా గంగావతి టీమ్, 3వ స్థానంలో కర్నూలు, 4వ స్థానంలో అనంతపురం టీంలు నిలిచాయి. ఆ జట్లకు నిర్వాహకులు నగదుతో పాటు కప్పులను అందజేశారు.
News January 18, 2025
మంత్రి ఫరూక్‌పై సీఎం అసంతృప్తి!
మంత్రులు, ఎంపీలతో సమావేశమైన సీఎం చంద్రబాబు నాయుడు వారి పనితీరు ఆధారంగా ర్యాంకులు ప్రకటించారు. సోషల్ మీడియాను వినియోగించుకోవడంలోనూ మార్కులు ఇచ్చారు. ప్రభుత్వ కార్యక్రమాలను సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేయడంలో మంత్రి ఫరూక్ వెనుకబడ్డారని సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రత్యేకంగా పీఆర్వో, ఉద్యోగులను ఇచ్చినా చివరిస్థానంలో నిలవడం సరికాదరి, ఈసారి ర్యాంకు మెరుగవ్వాలని సూచించారు.
News January 18, 2025
కర్నూలు, నంద్యాల జిల్లాలకు కొత్త డీఎస్పీలు
ఉమ్మడి కర్నూలు జిల్లాకు ఇద్దరు కొత్త డీఎస్పీలను కేటాయిస్తూ డీజీపి సీహెచ్ ద్వారకా తిరుమలరావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల శిక్షణ పూర్తి చేసుకున్న ప్రొబేషనరీ డీఎస్పీలకు పోస్టింగ్‌లు కేటాయించారు. అందులో భాగంగా ఆదోని డీఎస్పీగా మర్రిపాటి హేమలత, ఆళ్లగడ్డ డీఎస్పీగా కొలికిపూడి ప్రమోద్ నియమితులయ్యారు. త్వరలో వీరు బాధ్యతలు స్వీకరించనున్నారు.