News July 18, 2024

కర్నూలులో దారుణ హత్య.. UPDATE

image

కర్నూలులో నిన్న <<13648791>>హత్య<<>> జరిగిన విషయం తెలిసిందే. తాడిపత్రికి చెందిన శ్రీరాములు యాచకుడిగా జీవిస్తున్నారు. అదే వృత్తిలో ఉన్న ఫాతిమాతో పరిచయం ఏర్పడింది. ఆమెకు ఐదుగురు పిల్లలు ఉండగా ఒక కూతురు శ్రీరాములు ద్వారా జన్మించినట్లు తెలిసింది. శ్రీరాములు కూతురితో పరశురాం అనే వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడు. గొడవ జరగ్గా శ్రీరాములిని బండరాయితో కొట్టి పరశురాం హత్య చేశాడు. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.

Similar News

News December 26, 2025

మద్దికేర బాలికకు రాష్ట్రపతి చేతుల మీద అవార్డ్

image

మద్దికేర మండల కేంద్రానికి చెందిన ఉప్పర వీరప్ప, లలితల కుమార్తె శివాని శుక్రవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ప్రధానమంత్రి జాతీయ బాల పురస్కారం అందుకున్నారు. జావెలిన్ త్రో, షాట్ పుట్‌లో నాలుగేళ్లుగా కనబరుస్తున్న ప్రతిభను గుర్తించి ఈ పురస్కారానికి ఎంపిక చేశారు. కొన్ని రోజులగా తల్లి అనారోగ్యంతో మృతి చెందినప్పటికీ పట్టు వదలకుండా ముందుకు వెళ్లడంతో గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

News December 25, 2025

కర్నూలు: 9025 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు: ఎస్పీ

image

రోడ్డు ప్రమాదాల నివారణకు కర్నూల్ పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. జిల్లావ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ముమ్మరం చేసినట్లు పేర్కొన్నారు. 2025 జనవరి నుంచి డిసెంబర్ 20 వరకు 9,025 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేశామన్నారు. మద్యం తాగి వాహనం నడిపిన వారికి జరిమానాతో పాటు ఒక నెల జైలు శిక్ష విధించినట్లు చెప్పారు.

News December 25, 2025

గ్రామసభల్లో కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు: కలెక్టర్

image

రీ సర్వే పూర్తైన గ్రామాల్లో రైతులకు జనవరి 2 నుంచి 9 వరకు గ్రామసభల ద్వారా కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్ డా.ఏ.సిరి తెలిపారు. పాత భూ హక్కు పత్రాలు తీసుకుని రాజముద్రతో ఉన్న కొత్త పాస్ పుస్తకాలు అందజేస్తామని పేర్కొన్నారు. రైతులు గ్రామసభలకు హాజరుకావాలని కోరారు. గతంలో పంపిణీ చేసిన పాస్ పుస్తకలను వెనక్కి తీసుకొని రాజముద్ర కలిగిన పుస్తకలను అందజేస్తామన్నారు.