News October 26, 2024
కర్నూలులో నిలిచిన ఉల్లి క్రయవిక్రయాలు
కర్నూలు మార్కెట్‌లో ఉల్లి కొనుగోళ్లు నిలిచిపోయాయి. ఇప్పటికే కొనుగోలు చేసిన సరకు బయటకు తరలించేందుకు మరో రెండ్రోజులు పట్టే అవకాశం ఉండటంతో ఈనెల 28 వరకు కొనుగోళ్లను అధికారులు నిలిపివేశారు. రైతులు మార్కెట్‌కు సరకు తీసుకురావొద్దని మార్కెట్ కమిటీ కార్యదర్శి జయలక్ష్మి సూచించారు. 24న 19,711, నిన్న 22,500 క్వింటాళ్ల ఉల్లి మార్కెట్‌కు చేసింది. నిన్నటి సరకును కొనుగోలు చేయలేదు. రైతులు నిరీక్షిస్తున్నారు.
Similar News
News January 2, 2025
సమష్టి కృషితో జిల్లా అభివృద్ధికి కృషి చేద్దాం: కలెక్టర్
2025 నూతన సంవత్సరంలో కర్నూలు జిల్లా అభివృద్ధికి మనమందరం సమష్టిగా కృషి చేద్దామని కలెక్టర్ పీ.రంజిత్ బాషా అధికారులకు పిలుపునిచ్చారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ డా.బీ.నవ్య, డీఆర్‌వో సీ.వెంకట నారాయణమ్మ, జిల్లా అధికారులు, ఇతర సిబ్బంది గురువారం కలెక్టర్‌ను కలిశారు. పూల మొక్కలు అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
News January 2, 2025
KNL: విద్యార్థినిపై లైబ్రేరియన్ లైంగిక వేధింపులు.. YCP ఫైర్
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులోని గురుకులంలో ఓ విద్యార్థినిపై లైబ్రేరియన్ <<15043665>>లైంగిక<<>> వేధింపులకు పాల్పడిన ఘటన నిన్న వెలుగుచూసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై వైసీపీ ఫైర్ అయింది. కూటమి ప్రభుత్వ చేతగానితనంతో ఏపీలో కామాంధులు ఇష్టారీతిన రెచ్చిపోతున్నారని ఆరోపించింది. లా అండ్ ఆర్డర్‌ను గాలికొదిలేసి కాలయాపన చేస్తున్నారా? అంటూ సీఎం CM చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోం మంత్రి అనితను ప్రశ్నించింది.
News January 2, 2025
4 నెలలే దర్శనం.. ఈ ఆలయ చరిత్ర ఘనం!
సంగమేశ్వర దేవాలయం కర్నూలు <<15042913>>జిల్లాలో<<>> ప్రముఖ పుణ్యక్షేత్రం. ఆత్మకూరుకు 20 కి.మీ దూరంలో కృష్ణా నదిలో ఈ ఆలయం ఉంది. ఇది ఏడు నదులు కలిసే ప్రదేశం. తుంగ, భద్ర, కృష్ణ, వేణి, భీమ, మలాపహరిణి, భవనాసి అనే ఏడు నదులు కలుస్తుండటంతో సంగమేశ్వరం అని పిలుస్తారు. ఏడాదిలో 8 నెలలపాటు నీటిలో ఉండి కేవలం 4 నెలలు భక్తులకు దర్శనభాగ్యం కలిగించే ఆలయం. వేల సంవత్సరాల చరిత్ర ఉండగా ఎందరో మునుల తపస్సుకు ఈ ప్రాంతం ఆశ్రయమిచ్చింది.