News December 24, 2024
కర్నూలులో పతనమైన ఎండు మిర్చి ధర

కర్నూలు మార్కెట్‌లో ఎండు మిర్చి ధరలు భారీగా పడిపోయాయి. సోమవారం క్వింటా గరిష్ఠ ధర రూ.14,913 పలికింది. సరాసరి రూ.11,119, కనిష్ఠ ధర రూ.1,599తో విక్రయాలు సాగాయి. నెల క్రితం క్వింటా రూ.20 వేలు పలకగా ప్రస్తుతం భారీగా పడిపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మొక్కజొన్న రూ.2,052, కందులు గరిష్ఠ ధర రూ.7,449లు పలికాయి. ఉల్లి క్వింటా గరిష్ఠ ధర రూ.3,200, సజ్జలు గరిష్ఠ ధర రూ.2,403లతో అమ్ముడయ్యాయి.
Similar News
News December 14, 2025
కర్నూలు క్రీడాకారులను ఢిల్లీలో అభినందించిన ఎంపీ

న్యూఢిల్లీలో నిర్వహిస్తున్న స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా 69వ నేషనల్ స్కూల్ గేమ్స్‌లో పాల్గొంటున్న కర్నూలు ఈత క్రీడాకారులను ఎంపీ నాగరాజు ఆదివారం అభినందించారు. అండర్-19 విభాగంలో పాల్గొంటున్న హేమలత, అండర్-17 విభాగంలో పాల్గొంటున్న శృతి, సిరి చేతన రాజ్, లహరి ఢిల్లీలో ఎంపీని కలిశారు. వారు పాల్గొంటున్న ఈవెంట్ల గురించి ఎంపీ అడిగి తెలుసుకున్నారు. జాతీయ స్థాయిలో ప్రతిభ చాటాలని ఆకాంక్షించారు.
News December 14, 2025
కబడ్డీలో కర్నూలు బాలికలకు మూడో స్థానం

పల్నాడు జిల్లా పెదకూరపాడులో జరిగిన 51వ రాష్ట్రస్థాయి జూనియర్ కబడ్డీ పోటీల్లో కర్నూలు జిల్లా బాలికల జట్టు మూడో స్థానం సాధించింది. ఈ నెల 10 నుంచి 12 వరకు జరిగిన ఈ పోటీల్లో రాష్ట్రంలోని 26 జట్లు పాల్గొన్నాయి. క్రీడాకారులను ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి శ్రీకాంత్ అభినందించారు. జట్టులోని ఇందు, లలిత, ప్రశాంతి విశాఖపట్నంలో జరిగే జాతీయ స్థాయి శిక్షణా శిబిరానికి ఎంపికయ్యారు.
News December 14, 2025
లోక్ అదాలత్‌లో 19,577 కేసులు పరిష్కారం

జాతీయ లోక్‌అదాలత్‌లో కర్నూలు, నంద్యాల జిల్లాల్లో మొత్తం 19,577 కేసులు పరిష్కరించినట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.కబర్తి తెలిపారు. జిల్లా న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో 28 బెంచీల ద్వారా 284 సివిల్, 19,096 క్రిమినల్, 197 మోటార్ యాక్సిడెంట్ కేసులను పరిష్కరించారు. మోటార్ ప్రమాదాలకు సంబంధించిన కేసుల్లో బాధితులకు రూ. 6.34 కోట్ల నష్టపరిహారం చెల్లించినట్లు ఆయన వివరించారు.


