News September 21, 2025
కర్నూలులో రూ.100కే 45 కిలోల ఉల్లి: కలెక్టర్

మార్క్‌ఫెడ్ ద్వారా రైతుల నుంచి కొనుగోలు చేసిన 14 వేల క్వింటాళ్ల ఉల్లిని రూ.100కే 45 కిలోలు విక్రయిస్తున్నామని, వినియోగదారులు, వ్యాపారులు వినియోగించుకోవాలని కలెక్టర్ డాక్టర్ సిరి వెల్లడించారు. ఆదివారం కర్నూలు మార్కెట్ యార్డును జేసీ నవ్యతో కలిసి ఆమె పరిశీలించారు. రైతులకు హెక్టార్‌కు రూ.50 వేలు పరిహారం ఇస్తున్నందున ఈనెల 22 నుంచి మద్దతు ధర రూ.1,200 కలిపి వేస్తున్నామన్నారు.
Similar News
News September 21, 2025
సెలవు రోజుల్లో తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు: డీఈవో

దసరా సెలవుల్లో ప్రత్యేకత తరగతుల పేరుతో విద్యార్థులను పాఠశాలలకు పోయించుకుంటే కఠిన చర్యలు తప్పవని డీఈవో శామ్యూల్ పాల్ ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలను హెచ్చరించారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఇప్పటికే పలు పాఠశాలలపై ఫిర్యాదుల వచ్చాయన్నారు. విద్యాశాఖ అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి, పాఠశాలను మూసివేయిస్తారని హెచ్చరించారు.
News September 21, 2025
చెరువులను నీటితో నింపటానికి చర్యలు తీసుకోవాలి: కలెక్టర్

జిల్లాలోని మిగిలిన 206 చెరువులు నీటితో నింపటానికి చర్యలు తీసుకోవాలని, భూగర్భ జలాలను గణనీయంగా పెంచాలని కలెక్టర్ డాక్టర్ సిరి ఇరిగేషన్ శాఖ అధికారులను ఆదేశించారు. శనివారం కర్నూలులోని కలెక్టరేట్‌లో ఇరిగేషన్ శాఖపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రజలకు తాగునీటి ఇబ్బందులు రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు.
News September 21, 2025
పత్తికొండలో ఈనెల 22న జాబ్ మేళా

పత్తికొండలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ నెల 22న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ డా.మాధురి, నైపుణ్యాభివృద్ధి అధికారి ఆనంద్ రాజ్ కుమార్ తెలిపారు. ఈ మేళాలో 10 ప్రముఖ కంపెనీలు పాల్గొంటాయన్నారు. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అభ్యర్థులు ముందుగా https://naipunyam.ap.gov.in/ వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు.