News January 1, 2026

కర్నూలులో స్పెషల్ కంట్రోల్ రూమ్ ప్రారంభం

image

కర్నూలు జిల్లాలో ఆరోగ్యం, విద్య, సంక్షేమ వసతి గృహాల ఫిర్యాదుల పరిష్కారం కోసం కలెక్టర్ డా.ఏ.సిరి బుధవారం నూతన కంట్రోల్ రూమ్‌ ప్రారంభించారు. టోల్‌ ఫ్రీ నంబర్ 1800 425 4299కు వచ్చిన 109 కాల్స్‌లో ఇప్పటికే 99 సమస్యలు పరిష్కారమయ్యాయని పేర్కొన్నారు. 24 గంటల పాటు అందుబాటులో ఉండి ఆర్థికేతర సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

Similar News

News February 17, 2026

‘రియల్’ దూకుడు.. తగ్గేదేలే!

image

దేశంలో రియల్ ఎస్టేట్ మార్కెట్ 2030 నాటికి రూ.88 లక్షల కోట్లకు చేరనుందని KPMG-నరెడ్కో కన్సల్టెన్సీ సంస్థలు తెలిపాయి. గతేడాదితో పోలిస్తే ఇది మూడు రెట్లు ఎక్కువ. అప్పుడప్పుడు ఆటుపోట్లు ఎదురైనా 2047 నాటికి మరింత పెరిగి రూ.616.7 లక్షల కోట్లకు చేరే అవకాశం ఉందని ‘ది రోల్ ఆఫ్ ది రియల్ ఎస్టేట్ ఇన్ వికసిత్ భారత్-2047’ నివేదికలో వెల్లడించాయి. వికసిత్ భారత్ లక్ష్య సాధనలో రియల్ రంగం వెన్నెముకగా మారనుందన్నాయి.

News February 17, 2026

అనంత: ఫోన్ రీఛార్జ్‌కు డబ్బులు ఇవ్వలేదని సూసైడ్

image

ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన డి.హిరేహాల్ మండలం కళ్యం గ్రామానికి చెందిన నవీన్ అనే యువకుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. 2 రోజుల క్రితం నవీన్ తన మొబైల్ రీఛార్జ్ కోసం తండ్రిని డబ్బులు అడగగా ఇవ్వలేదు. దీంతో మనస్తాపానికి గురై పురుగు మందు తాగాడు. బళ్లారి విమ్స్‌కు తీసుకెళ్లగా చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News February 17, 2026

మిర్యాలగూడ: GOVT జాబ్ వదిలినా దక్కని ఛైర్‌పర్సన్ పదవి..!

image

కాంగ్రెస్ పార్టీ మిర్యాలగూడ పట్టణ అధ్యక్షుడు నూకల వేణుగోపాల్ రెడ్డి సతీమణి కవిత ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి మున్సిపల్ ఎన్నికల్లో బరిలో నిలిచారు. మున్సిపల్ ఛైర్‌పర్సన్ పదవి జనరల్ మహిళకు కేటాయించడంతో 17వ వార్డు నుంచి పోటీ చేసి గెలుపొందారు. మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యే దగ్గర అనుచరులుగా పేరు ఉంది. కాగా ఉద్యోగం వదిలేయడంతో ఛైర్‌పర్సన్ పదవి తనకే అనుకున్నారు. కానీ తనకు రాకపోవడంతో బాధతో వెనుదిరిగారు.