News November 20, 2024

కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు ప్రక్రియ షురూ!

image

కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ఎన్నికల వేళ కూటమి నేతలు ఇచ్చిన హామీ మేరకు సీఎం కార్యాలయం నుంచి తాజాగా న్యాయశాఖకు ప్రభుత్వం లేఖ రాసింది. దీంతో ప్రక్రియను న్యాయశాఖ ప్రారంభించింది. కర్నూలులో బెంచ్ ఏర్పాటుకు సంబంధించి హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌కు న్యాయశాఖ కార్యదర్శి సునీత లేఖ రాశారు. రాయలసీమ జిల్లాలకు సంబంధించి హైకోర్టులో దాఖలైన కేసులు వివరాలు ఇవ్వాలని కోరారు.

Similar News

News November 21, 2024

పులి పిల్లలు అనుకున్నారు.. కానీ జంగం పిల్లి కూనలు

image

మండల కేంద్రమైన కొత్తపల్లి శివారులో బుధవారం జంగం పిల్లి కూనల సంచారం కలకలం రేపింది. కొత్తపల్లి నుంచి హరిహరం వెళ్లే దారిలో గోవిందు అనే రైతు పొలంలో 4 జంగం పిల్లి కూనలు రైతుల కంటపడ్డాయి. తొలుత ఈ కూనలను పులి కూనలని రైతులు భావించినప్పటికీ.. అటవీ అధికారులు అవి జంగం పిల్లి కూనలుగా గుర్తించారు. సాయంత్రానికి వాటి తల్లి వచ్చి పిల్లలను తీసుకెళ్లిందని రైతులు తెలిపారు.

News November 21, 2024

సీఎంకు సోషల్ మీడియా వణుకు: కాటసాని

image

వైసీపీ సోషల్ మీడియా ప్రతినిధుల అరెస్టులపై బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి పరోక్షంగా స్పందించారు. టెక్నాలజీని తానే కనిపెట్టానని చెప్పుకునే సీఎం చంద్రబాబు నాయుడు.. ఇప్పుడు సోషల్ మీడియా పేరు చెబితేనే వణికిపోతున్నారని ఆరోపించారు. ఆయనకు నిద్రలేని రాత్రులు పరిచయం చేసిన సోషల్ మీడియా కుర్రాళ్లు.. మున్ముందు ఆయనకు బుద్ధి చెప్పడం ఖాయమని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.

News November 21, 2024

‘వక్ఫ్ బోర్డు చట్ట సవరణలకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయాలి’

image

కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన వక్ఫ్ బోర్డ్ సవరణల బిల్లును వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయాలని ఆవాజ్ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు ఎస్ఏ సుభాన్, జిల్లా అధ్యక్షుడు ముస్తఫా డిమాండ్ చేశారు. బుధవారం కర్నూలులో జరిగిన కార్యకర్తల సమావేశంలో వారు మాట్లాడారు. ముసల్మాన్లకు సంబంధించిన మదరసాలు, ఖబరస్థాన్లు, మసీదులు ఏవీ మిగలకుండా చేయడమే బీజేపీ సంకల్పం అని, దీని వెనక ఆర్ఎస్ఎస్ కుట్ర దాగి ఉందని అన్నారు.