News August 24, 2025

కర్నూలు: ఈనెల 29న సరిహద్దుల మార్పు కోసం విజ్ఞప్తుల స్వీకరణ

image

ఉమ్మడి జిల్లాకు సంబంధించి కర్నూలు సునయన ఆడిటోరియంలో 29న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మండల, గ్రామాల పేర్లు, సరిహద్దుల మార్పు కోసం అభ్యర్థనలు స్వీకరించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు.. జిల్లా, మండల, గ్రామాల పేర్లు, అలాగే వాటి సరిహద్దులు మార్పు కోసం ప్రజలు, ప్రజాప్రతినిధుల నుంచి ఈనెల 29న రాష్ట్ర మంత్రుల బృందం విజ్ఞప్తులను స్వీకరిస్తారని నంద్యాల కలెక్టర్ రాజకుమారి పేర్కొన్నారు.

Similar News

News August 24, 2025

NGKLలో దారుణం.. అడవిలో భార్యను కాల్చి చంపిన భర్త

image

భార్యను కాల్చి చంపిన ఘటన NGKL జిల్లాలో జరిగింది. పోలీసుల ప్రకారం.. లింగాల(M) కొత్తరాయవరం వాసి శ్రీశైలం MBNRకు చెందిన శ్రావణిని ప్రేమించి 2014లో పెళ్లిచేసుకున్నాడు. ఇద్దరి మధ్య కొంత కాలంగా మనస్పర్థలు రావడంతో శ్రావణి ఇద్దరు పిల్లలతో కలిసి వేరుగా ఉంటుంది. ఈ క్రమంలో సోమశిలకు వెళ్దామని మాయమాటలు చెప్పి ఈనెల 21న పెద్దకొత్తపల్లిలోని సాతాపూర్ మారేడుమాన్‌దిన్నే అడవి ప్రాంతంలోకి తీసుకెళ్లి కాల్చి చంపాడు.

News August 24, 2025

కామారెడ్డిలో రేపు ప్రజావాణి

image

కామారెడ్డి కలెక్టరేట్‌లో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరిస్తారని చెప్పారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

News August 24, 2025

రేపట్నుంచి స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ: నాదెండ్ల

image

AP: రాష్ట్రంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ రేపట్నుంచి ప్రారంభమవుతుందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ‘1.46 కోట్ల కుటుంబాలకు కూటమి ప్రభుత్వం రేపటి నుంచి స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేయనుంది. ATM కార్డు సైజు, క్యూఆర్ కోడ్‌తో ఈ కార్డు ఉంటుంది’ అని తెలిపారు. ‘ఇది CM చంద్రబాబు ఆధ్వర్యంలో చేపట్టిన గొప్ప కార్యక్రమం. నాదెండ్ల మనోహర్‌కు ధన్యవాదాలు’ అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు.