News July 21, 2024
కర్నూలు: ఈ నెల 24వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోండి

ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఐ.టి.ఐ కాలేజీల్లో వివిధ ట్రేడ్లలో రెండో విడత ప్రవేశాల కోసం ఈ నెల 24వ తేదీ దరఖాస్తులు చేసుకోవాలని ఐ.టి.ఐ కాలేజీల జిల్లా కన్వీనర్ కృష్ణమోహన్ తెలిపారు. ఈ నెల 24వ తేదీ వరకు గడువు ఉందని తెలిపారు. దరఖాస్తు చేసుకున్న వారికి 25న సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుందన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Similar News
News November 7, 2025
రోడ్డు భద్రతా నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు: ఎస్పీ

రోడ్డు భద్రతా నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. శుక్రవారం కర్నూలు జిల్లాలో పోలీసు అధికారులు స్కూల్, కళాశాలల్లో అవగాహన కల్పించారు. ఆటోలు, బస్సుల్లో పరిమితికి మించి ప్రయాణం చేయరాదని, ట్రాఫిక్ రూల్స్ పాటించాలని ఆటో డ్రైవర్లకు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఓవర్ లోడింగ్, ఓవర్ స్పీడ్, రాంగ్ రూట్, డ్రైవింగ్ సమయంలో మొబైల్ వినియోగం మానుకోవాలని సూచించారు.
News November 7, 2025
ఈనెల 12న RUకు గవర్నర్ అబ్దుల్ నజీర్ రాక: వీసీ

ఈ నెల 12న రాయలసీమ యూనివర్సిటీలో నిర్వహిస్తున్న 4వ కాన్వకేషన్‌కు గవర్నర్ అబ్దుల్ నజీర్ హాజరవుతున్నట్లు వైస్ ఛాన్స్లర్ వెంకట బసవరావు వెల్లడించారు. శుక్రవారం యూనివర్సిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. యూనివర్సిటీలో 75 మంది విద్యార్థులకు గోల్డ్ మెడల్స్, 283 మంది స్కాలర్లకు కాన్వకేషన్ పట్టాలు, 18,396 మందికి ఓడీ ప్రదానం చేయనున్నారని పేర్కొన్నారు.
News November 7, 2025
‘మన మిత్ర’ సేవలు ప్రతి ఇంటికి: కలెక్టర్ సిరి

కర్నూలు జిల్లాలోని వంద శాతం కుటుంబాలు వాట్సాప్ గవర్నెన్స్ సేవలను వినియోగించుకునేలా నేటి నుంచి ప్రతి శుక్రవారం ఇంటింటి ప్రచారం ప్రారంభించాలని కలెక్టర్ డా.ఏ.సిరి సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. ప్రతి ఇంటికి వెళ్లి సేవలపై అవగాహన కల్పించాలని సూచించారు. ప్రతి కుటుంబం ‘మన మిత్ర’ యాప్ ద్వారా సేవలను వినియోగించుకునేలా మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు, జడ్పీ సీఈవోలు, డీఎల్డీవోలు పర్యవేక్షించాలని సూచించారు.


