News November 5, 2025

కర్నూలు కలెక్టరే టీచర్!

image

కర్నూలు కలెక్టర్ ఏ.సిరి మంగళవారం కోడుమూరులోని మహిళా సాంఘిక సంక్షేమ హాస్టల్‌ను సందర్శించారు. విద్యార్థినుల మధ్య ఉపాధ్యాయురాలిగా కూర్చుని, వారికి విద్యపై మార్గదర్శకత్వం అందించారు. చదువులో మెళకువలు, సమయపాలన ప్రాముఖ్యత గురించి వివరించారు. కష్టపడి చదివి తల్లిదండ్రులకు, సమాజానికి మంచి పేరు తెచ్చుకోవాలని ప్రోత్సహించారు. హాస్టల్‌లో ఎలాంటి సమస్యలు ఎదురైనా వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు.

Similar News

News November 5, 2025

భద్రాచలం గోదావరి వద్ద కార్తీక శోభ

image

కార్తీక పౌర్ణమి సందర్భంగా బుధవారం ఉదయం భద్రాచలం వద్ద గోదావరి నది తీరంలో సందడి వాతావరణం నెలకొంది. భక్తులు పెద్ద సంఖ్యలో గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి, కార్తీక దీపాలను నదిలో వదిలి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దేవస్థానం, గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దీంతో దేవాలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి.

News November 5, 2025

తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఎంతంటే?

image

కార్తీక పౌర్ణమి వేళ బంగారం ధరలు తగ్గి కొనుగోలుదారులకు ఉపశమనాన్నిచ్చాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.980 తగ్గి రూ.1,21,480కు చేరింది. 22క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు రూ.900 పతనమై రూ.1,11,350 పలుకుతోంది. అటు కేజీ వెండి ధర రూ. 2,000 తగ్గి రూ. 1,63,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.

News November 5, 2025

VJA: బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు

image

ప్రయాణికుల రద్దీ మేరకు విజయవాడ మీదుగా శ్రీకాకుళం(CHE)- బెంగళూరు కంటోన్మెంట్(BNC) మధ్య ప్రత్యేక రైళ్లు నడుపుతున్నామని రైల్వే అధికారులు తెలిపారు. నం.08553 CHE- BNC రైలు ఈ నెల 21న రాత్రి 11.35కి విజయవాడ, తర్వాత రోజు మధ్యాహ్నం 2.45కు BNC చేరుకుంటుందన్నారు. నం. BNC- CHE రైలు ఈ నెల 24న మధ్యాహ్నం 2కి బెంగళూరులో బయలుదేరి తర్వాత రోజు ఉదయం 7కు విజయవాడ, సాయంత్రం 5కు శ్రీకాకుళం చేరుకుంటుందన్నారు.