News April 24, 2024
కర్నూలు: గవర్నమెంట్ స్కూల్‌లో చదివి..593 మార్కులు

దేవనకొండ మండలం తెర్నేకల్ గ్రామనికి చెందిన త్రివేణి గవర్నమెంట్ స్కూల్‌లో చదివి టెన్త్ ఫలితాలలో ఉత్తమ మార్కులు సాధించింది. విద్యార్థిని తండ్రి నాగేశ్ ఆటో నడుపుతున్నాడు. పదో తరగతి ఫలితాలలో 600 మార్కులకుగాను 593 మార్కులు సాధించింది.
Similar News
News November 6, 2025
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్-2025కు సిద్ధం కావాలి: చీఫ్ ఎలక్టోరల్ అధికారి

కర్నూల్ జిల్లాలో ఓటర్ల జాబితా లోపరహితంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులను చీఫ్ ఎలక్టోరల్ అధికారి వివేక్ యాదవ్ ఆదేశించారు. కర్నూలు కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ డా.ఏ.సిరి, అధికారులు పాల్గొన్నారు. కొత్తగా 18 ఏళ్లు నిండిన వారిని ఓటర్‌లుగా నమోదు చేయాలన్నారు. డూప్లికెట్, చనిపోయిన ఓటర్ల పేర్లు తొలగించాలని కలెక్టర్‌ను ఆదేశించారు.
News November 5, 2025
ప్రైవేట్, ఆర్టీసీ బస్సుల్లో ముమ్మర తనిఖీలు

ఇటీవల జరిగిన బస్సు ప్రమాదం నేపథ్యంలో రాత్రి పూట నడిచే ప్రైవేట్, ఆర్టీసీ ట్రావెల్స్ బస్సుల్లో భద్రతా ప్రమాణాల అమలుపై ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. వాహన పత్రాలు, డ్రైవర్ల లైసెన్సులు, భద్రతా పరికరాలు పరిశీలించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు.
News November 5, 2025
ప్రభుత్వ ఆసుపత్రిలో సమస్యలు త్వరగా పరిష్కరిస్తాం: కలెక్టర్

కర్నూలు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి, మెడికల్ కాలేజీ సమస్యలను త్వరగా పరిష్కరిస్తామని కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి తెలిపారు. బుధవారం సాయంత్రం మెడికల్ కాలేజీ సమావేశ మందిరంలో అన్ని వైద్య విభాగాల అధికారులతో ఆమె సమావేశం నిర్వహించారు. వైద్య పరికరాలు, సిబ్బంది నియామకాలు, వసతుల మెరుగుదల కోసం చర్యలు తీసుకుంటామన్నారు. మంత్రి టీజీ భరత్ సహకారంతో సమస్యలను పరిష్కరిస్తామని కలెక్టర్ తెలిపారు.


