News June 12, 2024

కర్నూలు: చంద్రబాబు సమీక్షలో జిల్లా మంత్రులు

image

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులతో ఉండవల్లిలోని తన నివాసంలో సమీక్షించారు. ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచి మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, NMD ఫరూఖ్, టీజీ భరత్ పాల్గొన్నారు. కాగా రేపటిలోగా నూతన మంత్రులకు శాఖలు కేటాయించనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎవరికి ఏ శాఖ వరిస్తుందోనని ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది.

Similar News

News October 1, 2024

పింఛన్ పంపిణీ@2PM: కర్నూలు 96.43%, నంద్యాల 94.26%

image

ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పథకం కింద పింఛన్ల పంపిణీ కార్యక్రమం పండగలా కొనసాగుతోంది. మధ్యాహ్నం 2 గంటలకు కర్నూలు జిల్లాలో 96.43%, నంద్యాల జిల్లాలో 94.26% పంపిణీ పూర్తయింది. కర్నూలు జిల్లాలో 2,41,843 మందికి గానూ 2,33,204 మందికి, నంద్యాల జిల్లాలో 2,18,225 మందికి గానూ 2,05,691 మందికి పింఛన్ల సొమ్ము అందింది.

News October 1, 2024

ఒక్కసారైనా రక్తదానం చేశారా?

image

అక్టోబర్ 1.. జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం. రక్తదానంపై చైతన్యం కలిగించేందుకు 1975 నుంచి ఏటా నిర్వహిస్తున్నారు. రక్తదానం అన్ని దానాల కంటే ముఖ్యమైనది. ‘రక్తదానం చేయండి-ప్రాణదాతలుకండి’ అన్న నినాదాన్ని తరచూ వింటుంటాం. ఇదే స్ఫూర్తిగా జిల్లాలోని రక్తదాతలు ఆపద వేళ మేమున్నామంటూ ఎంతో మందికి పునర్జన్మనిస్తున్నారు. కొందరు పదుల సార్లు రక్తదానం చేసి అండగా నిలుస్తున్నారు. మరి మీరు ఒక్కసారైనా రక్తదానం చేశారా?

News October 1, 2024

కర్నూలులో కుక్కల దాడి.. 30 మందికి గాయాలు

image

కర్నూలులోని వన్‌టౌన్‌ పరిధిలో కుక్కలు దాడి చేయడంతో 30 మందికిపైగా చిన్నారులు గాయపడ్డారు. వన్‌టౌన్‌ పరిధిలోని బండిమెట్ట, గడ్డా వీధి, చిత్తారి వీధి, గరీబ్‌ నగర్‌ ప్రాంతాల్లో సోమవారం రాత్రి కుక్కలు దాడి చేశాయి. గాయపడిన చిన్నారులను కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాధిత చిన్నారులను మంత్రి భరత్‌, జిల్లా కలెక్టర్‌ రంజిత్‌ బాషా పరామర్శించారు. గాయపడిన ఒక్కో చిన్నారికి రూ.10వేల పరిహారం అందిస్తామన్నారు.