News October 6, 2024
కర్నూలు: జాతీయస్థాయి రగ్బీ పోటీలకు లక్ష్మాపురం విద్యార్థి ఎంపిక
కర్నూలు ఆదర్శ విద్యా మందిరంలో ఈ నెల 2, 3వ తేదీల్లో రాష్ట్రస్థాయిలో జరిగిన ఎస్జీఎఫ్ అండర్-19 జాతీయ స్థాయి రగ్బీ పోటీలకు లక్ష్మాపురం గురుకులం బాలిక జ్యోతి ఎంపికైంది. ఈ మేరకు వ్యాయామ ఉపాధ్యాయురాలు లావణ్య ఆదివారం తెలిపారు. రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికవ్వడం పట్ల జ్యోతిని పాఠశాల అధ్యాపక బృందం అభినందించారు.
Similar News
News December 21, 2024
441 మంది విద్యార్థులతో ప్రపంచ ధ్యాన దినోత్సవ వేడుకలు
కర్నూలులోని ఓ పాఠశాల ఆవరణలో 441 మంది విద్యార్థులతో 1వ ప్రపంచ ధ్యాన దినోత్సవ వేడుకలను శనివారం నిర్వహించారు. కార్యక్రమానికి పుల్లారెడ్డి కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ సురేశ్, ప్రధానోపాధ్యాయురాలు మీనాక్షి హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం విద్యావేత్త రాజశేఖర్ మాట్లాడుతూ.. ప్రతి విద్యార్థి మానసిక ఒత్తిడిని అధిగమించేందుకు ప్రతిరోజూ క్రమం తప్పకుండా ధ్యానం చేయాలని సూచించారు.
News December 21, 2024
అనంతపురంలో కర్నూలు జిల్లా బాలుడి ఆత్మహత్య
ఇష్టం లేని పని చేయలేక ఓ బాలుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన శుక్రవారం అనంతపురంలో చోటుచేసుకుంది. కర్నూలు జిల్లా ఆదోని మండలం పెద్దతుంబలంకి చెందిన శివ (14) తల్లిదండ్రుల బలవంతంపై అనంతపురంలో తన అన్నతో కలిసి సెంట్రింగ్ పనులు చేస్తున్నాడు. తాను వ్యవసాయం చేసుకుంటానని సెంట్రింగ్ పనులు చేయలేనని తల్లిదండ్రులకు చెప్పినా వినకపోవడంతో అనంతపురంలోని తన గదిలో ఉరేవేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు టూ టౌన్ పోలీసులు తెలిపారు.
News December 21, 2024
కర్నూలు: కాసేపట్లో.. ప్రాజెక్టు కమిటీ ఎన్నికలు
కర్నూలు జిల్లాలో నేడు ప్రాజెక్టు కమిటీ ఎన్నికలు జరగనున్నాయి. ఎల్లెల్సీ, గాజులదిన్నె, తెలుగుగంగ, కేసీకాల్వ, ఎస్సార్‌బీసీ ప్రాజెక్టు కమిటీలకు ఉదయం 9 గంటల నుంచి ఎన్నికలు జరుగుతాయి. ప్రాజెక్టు కమిటీ ఛైర్మన్, వైస్ ఛైర్మన్‌లను ఎన్నుకుంటారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇటీవల జరిగిన సాగునీటి సంఘం ఎన్నికల్లో అధ్యక్షులు, డీసీలను ఎన్నుకున్న విషయం తెలిసిందే.