News February 14, 2025

కర్నూలు జిల్లాకు చెందిన DSP మృతి

image

కర్నూలు జిల్లా ఆస్పరికి చెందిన బంత్రోతి నాగరాజు(50) మృతిచెందారు. రాజమహేంద్రవరంలో సీఐడీ ప్రాంతీయ డీఎస్పీగా విధులు నిర్వహిస్తున్న ఆయన.. కొంతకాలంగా కాలేయం, గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతూ గతేడాది డిసెంబర్ వరకు మెడికల్ లీవ్‌లో ఉన్నారు. ఈనెల 2న తిరిగి విధుల్లో చేరారు. ఈ క్రమంలో గురువారం గాంధీపురం-3లో అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

Similar News

News November 16, 2025

ఆదోని జిల్లా సాధించి తీరుతా: ఎమ్మెల్యే పార్థసారథి

image

ఆదోనిని ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలని కోరుతూ ఆదివారం పట్టణంలో చేపట్టిన నిరాహార దీక్షలో ఎమ్మెల్యే పార్థసారథి, కురువ కార్పొరేషన్ చైర్మన్ మాన్వి దేవేంద్రప్ప పాల్గొన్నారు. నియోజకవర్గ అభివృద్ధి జరగాలంటే జిల్లా ఏర్పాటుతోనే సాధ్యమని ఆయన అన్నారు. ఈ విషయాన్ని అసెంబ్లీలో ప్రస్తావించి, ఆదోని జిల్లాను సాధించి తీరుతానని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే హామీపై స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

News November 16, 2025

సివిల్స్‌కు ఉచిత కోచింగ.. దరఖాస్తుల ఆహ్వానం

image

డా. బి.ఆర్. అంబేడ్కర్ స్టడీ సర్కిల్ ద్వారా యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమ్స్-2026, మెయిన్స్‌కు ఉచిత రెసిడెన్షియల్ కోచింగ్‌కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కర్నూలు కలెక్టర్ డా. ఏ. సిరి తెలిపారు. డిగ్రీ పూర్తి చేసిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓసీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులు అర్హులని ఆమె వెల్లడించారు. రాష్ట్రంలో మొత్తం 340 సీట్లు ఉన్నాయన్నారు. అభ్యర్థులు నవంబర్ 26 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

News November 16, 2025

కర్నూలు: రేపు ‘డయల్ యువర్ APSPDCL CMD’

image

విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 17న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ‘డయల్ యువర్ APSPDCL CMD’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు సీఎండీ శివశంకర్ తెలిపారు. తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, కడప, కర్నూలు, అనంతపురం సహా తొమ్మిది జిల్లాల వినియోగదారులు 8977716661 నంబరుకు కాల్ చేసి తమ సమస్యలు చెప్పవచ్చని ఆయన పేర్కొన్నారు.