News August 20, 2024

కర్నూలు జిల్లాకు మళ్లీ వర్ష సూచన

image

కర్నూల్ జిల్లాలో నేడూ వర్షాలు కొనసాగే అవకాశం ఉందని ఏపీ వెదర్ మ్యాన్ తెలిపారు. ఇవాళ అర్ధరాత్రి మరోసారి కుండపోత వర్షానికి ఛాన్స్ ఉందని ట్వీట్ చేశారు. కాగా నిన్న రాత్రి నుంచి ఉదయం వరకు కురిసిన భారీ వర్షానికి జిల్లాలోని వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. పత్తికొండ-ఆదోని మధ్య కాసేపు రాకపోకలు నిలిచిపోయాయి. అమృతాపురంలో టోపీ మారెమ్మవ్వ ఆలయంలోకి వరద నీరు చేరింది. హంద్రీ నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది.

Similar News

News November 8, 2025

ఆదోని: ఈతకెళ్లి బాలుడి మృతి

image

ఆదోని పరిధిలోని బసాపురంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. గౌరమ్మ పండుగ సందర్భంగా పుట్టింటికి వచ్చిన బిచ్చల ఈరన్న కూతురు వరమ్మ కుమారుడు కాలువలో శవంగా తేలాడు. శుక్రవారం పండుగ సందర్భంగా కుటుంబ సభ్యులు సంబరాల్లో మునిగారు. ఐతే బాలుడు ఒంటరిగా ఈత ఆడుకుంటూ కాలువలో కొట్టుకుపోయాడు. శనివారం హనువాళ్లు గ్రామంలో మృతదేహం లభ్యమైంది. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

News November 8, 2025

పెద్దకడబూరులో హోరాహోరీగా పొట్టేళ్ల పందేలు

image

పెద్దకడబూరులో శ్రీ భక్త కనకదాసు జయంతిని పురస్కరించుకుని కురువ సంఘం ఆధ్వర్యంలో శనివారం పొట్టేళ్ల పందాలను టీడీపీ నేతలు రమాకాంతరెడ్డి, మల్లికార్జున ప్రారంభించారు. గ్రామీణ క్రీడలలో భాగమే పొట్టేళ్ల పందేలని గుర్తు చేశారు. ఇందులో గెలుపొందిన పొట్టేళ్లకు నగదు బహుమతులు అందజేస్తామన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన నల్ల, నట్టు పొట్టేళ్లకు వేరు వేరుగా పోటీలు నిర్వహించారు.

News November 8, 2025

భార్యను హత్య చేసిన భర్తకు జీవిత ఖైదు

image

2018 నవంబర్ 18న భార్య లక్ష్మీ దేవిని గొంతు నులిమి చంపిన కేసులో కర్నూలు శివప్ప నగర్‌కు చెందిన ముద్దాయి శ్రీనివాసులుకు జీవిత ఖైదు, రూ.10 వేలు జరిమానా విధిస్తూ కర్నూలు మొదటి అదనపు జిల్లా సెషన్స్ జడ్జి శుక్రవారం తీర్పునిచ్చారు. ముద్దాయి 4వ పట్టణ పోలీస్ స్టేషన్‌లో రౌడీ షీటర్‌గా ఉన్నాడు. 2007లో లక్ష్మీదేవిని ప్రేమ వివాహం చేసుకున్న శ్రీనివాసులు అనుమానంతో హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు.