News January 13, 2026
కర్నూలు జిల్లాకు వాటితో ముప్పు..!

కర్నూలు జిల్లాలోని రెండు మండలాల భూగర్భ జలాల్లో ప్రమాదకర స్థాయిలో యురేనియం ఉన్నట్లు ‘సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డు’ తాజాగా హెచ్చరించింది. దేవనకొండ మండలం కరివేములలో అత్యధికంగా 50.7 ppb సాంద్రత నమోదవ్వగా, ఆదోని మండలం నాగనాథనహల్లిలో 63.6 ppb ఉన్నట్లు గుర్తించారు. 30 ppbలోపు ఉంటేనే సురక్షితమని, ఇంతటి భారీ సాంద్రత వల్ల కిడ్నీ వ్యాధులు, క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News January 26, 2026
నేడు గిగ్ వర్కర్ల సమ్మె.. నిలిచిపోనున్న డెలివరీ సేవలు!

గిగ్ వర్కర్లు ఇవాళ దేశవ్యాప్తంగా సమ్మెకు దిగనున్నారు. దీంతో స్విగ్గీ, జొమాటో, బ్లింకిట్ వంటి యాప్‌ల సేవలు నిలిచిపోనున్నాయి. వర్కర్లందరూ యాప్‌ల నుంచి లాగౌట్ చేసి నిరసన చేపట్టనున్నట్లు గిగ్&ప్లాట్‌ఫామ్ సర్వీస్ వర్కర్స్ యూనియన్ ప్రకటించింది. దీంతో డెలివరీ సేవలు నిలిచిపోవడం లేదా ఆలస్యమయ్యే అవకాశాలున్నాయి. తమ డిమాండ్లపై ప్రభుత్వం స్పందించకపోతే Feb 3న మరోసారి ఆందోళన చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు.
News January 26, 2026
గుంటూరు: 350 మందికి అవార్డులు

గుంటూరు జిల్లా కేంద్రంగా గణతంత్ర దినోత్సవం సందర్భంగా వివిధ శాఖలకు చెందిన అధికారులు, ఉద్యోగులు, పోలీస్ సిబ్బంది, వైద్యులు, ఉపాధ్యాయులు, ఇంజినీర్లు, గ్రామ స్థాయి సిబ్బందికి అవార్డులు ప్రకటించారు. కలెక్టర్ కార్యాలయం విడుదల చేసిన జాబితాలో 351 మందికి పైగా అవార్డులు పొందనున్నట్లు వెల్లడైంది. ప్రభుత్వ సేవల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారిని సత్కరించనున్నారు.
News January 26, 2026
సింగరేణిలో రూ.6 వేల కోట్ల కుంభకోణం: కొప్పుల ఈశ్వర్

సింగరేణిలో సైట్ విజిట్ పేరుతో భారీ అవినీతి జరిగిందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. ఆదివారం గోదావరిఖనిలోని టీబీజీకేఎస్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సుమారు రూ.6,000 కోట్ల మేర కుంభకోణం జరిగిందని, దీనిపై కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్, తదితరులు పాల్గొన్నారు.


