News August 29, 2024

కర్నూలు జిల్లాకు సీఎం చంద్రబాబు రాక

image

సీఎం చంద్రబాబు నాయుడు ఈ నెల 31న కర్నూలు జిల్లాకు రానున్నారు. పత్తికొండ మండలం పుచ్చకాయలమడ గ్రామంలో పింఛన్ల పంపిణీలో సీఎం పాల్గొంటారు. సీఎం పర్యటన నేపథ్యంలో పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు, ఆర్డీవో రామలక్ష్మి, డీఎస్పీ వెంకటరామయ్య గ్రామంలో స్థలాన్ని పరిశీలించారు. సెప్టెంబరు 1న సెలవు నేపథ్యంలో ఒకరోజు ముందుగానే 31న పింఛన్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే.

Similar News

News October 6, 2025

మట్టి మిద్దె కూలి ఐదేళ్ల బాలిక మృతి

image

మంత్రాలయం మండలం మాధవరంలో విషాదం చోటు చేసుకుంది. పాత మట్టి మిద్దె ఇల్లు అకస్మాత్తుగా కూలిపోవడంతో ఐదేళ్ల బాలిక లలిత సోమవారం మృతిచెందింది. ఇంట్లో నిద్రిస్తున్న కుటుంబ సభ్యుల్లో ముగ్గురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. స్థానికులు మట్టి గడ్డలను తొలగించి వారిని రక్షించారు. బాలికను ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదైంది.

News October 6, 2025

కర్నూలు టీచర్లకు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు

image

విద్యారంగంలో విశిష్ట సేవలందించిన కర్నూలు బి.క్యాంప్ ప్రభుత్వ వొకేషనల్ జూనియర్ కళాశాల ఉపాధ్యాయులు వైవీ రామకృష్ణ, ఎన్.విజయశేఖర్‌కు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డులు ప్రదానం చేశారు. ప్రపంచ అధ్యాపక దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం కర్నూలు సెంట్రల్ లైబ్రరీ సమావేశ మందిరంలో NHR SJC India–Global, UCP & LRF సంయుక్త ఆధ్వర్యంలో లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డులు అందజేశారు.

News October 5, 2025

సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్‌పై పోటీలు: డీఈవో

image

ఈనెల 7న జిల్లాలోని ఉన్నత పాఠశాలల్లో ‘సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్’ అంశంపై వ్యాసరచన, చిత్రలేఖన పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్ పాల్ శనివారం తెలిపారు. విద్యార్థుల సృజనాత్మకతను వెలికితీసేందుకు ఈ పోటీలు మంచి వేదికగా నిలుస్తాయని అన్నారు. వివరాలకు కర్నూల్–II సర్కిల్ (9000724191)తో సమన్వయం చేసుకోవాలని సూచించారు.