News March 7, 2025
కర్నూలు జిల్లాలో ఇద్దరు విద్యార్థుల డీబార్

కర్నూలు జిల్లా వ్యాప్తంగా శుక్రవారం ఇంటర్మీడియట్ రెండో సంవత్సర విద్యార్థులకు నేడు పార్ట్ 3లోని సబ్జెక్టుల పరీక్షలు జరిగాయి. చూచిరాతలకు పాల్పడిన ఇద్దరు విద్యార్థులను డీబార్ చేసినట్లు ఇంటర్ బోర్డు ప్రాంతీయ అధికారి గురువయ్య శెట్టి తెలిపారు. 20,864 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా, 414 మంది గైర్హాజరు అయ్యారు. బి.క్యాంప్‌లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, ఒకేషనల్ కళాశాలలోనే డీబార్ అయినట్లు తెలిపారు.
Similar News
News March 9, 2025
ఆదోని అథ్లెట్ కాజా బిందె నవాజ్‌కు గోల్డ్ మెడల్

45వ మాస్టర్స్ అథ్లెటిక్స్ నేషనల్ ఛాంపియన్‌షిప్‌లో కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన కాజా బిందె నవాజ్ 60+ పురుషుల విభాగంలో 300 మీటర్ల హర్డిల్స్‌లో స్వర్ణ పతకం గెలుచుకుని ఆదోనికి గర్వించదగ్గ విజయం సాధించారు. ఏళ్ల శ్రమ, అంకితభావం, పట్టుదల ఫలితంగా ఈ గొప్ప ఘనత అందుకున్నారు. ఈ విషయం తెలిసి ఆదోని క్రీడాకారులు, అభిమానులు ఆయన మెచ్చుకున్నారు.
News March 9, 2025
నంద్యాలలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు

కర్నూలు, నంద్యాల జిల్లాలో ఎండలు మండుతున్నాయి. శనివారం తీవ్ర వేడి వాతావరణం కొనసాగడంతో పాటు వడ గాల్పులు వీచాయి. ఈ క్రమంలో నంద్యాలలో అత్యధికంగా 39.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మరోపక్క కనిష్ఠ ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదు కావడంతో రాత్రి సమయంలో చలి తీవ్రత పెరిగింది. దీంతో పగలు ఎండలు, రాత్రి చలికి తీవ్ర ఇబ్బందులు పడుతూ ప్రజలు బెంబేలెత్తుతున్నారు.
News March 8, 2025
కుటుంబంలో సమాజంలో మహిళ పాత్ర విశిష్టం: కలెక్టర్

కుటుంబంలో, సమాజంలో మహిళ పాత్ర విశిష్టం అని కలెక్టర్ పీ.రంజిత్ బాషా పేర్కొన్నారు. శనివారం కర్నూలులోని కన్వెన్షన్ హాల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రపంచ వ్యాప్తంగా పండుగలా జరుపుకోవడం సాధించడమే మహిళలు సాధించిన గొప్ప గెలుపుగా అభివర్ణించారు. జాయింట్ కలెక్టర్ నవ్య పాల్గొన్నారు.