News February 13, 2025
కర్నూలు జిల్లాలో ఉరేసుకుని వివాహిత మృతి

కర్నూలు జిల్లా పెద్ద తుంబలం గ్రామంలో విషాద ఘటన జరిగింది. 21ఏళ్ల వివాహిత అనూష ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. అనూష, శాంతరాజును ప్రేమించి వివాహం చేసుకుంది. వీరికి ఇద్దరు పిల్లలు. ఈ క్రమంలో ఆమె ఆత్మహత్యకు పాల్పడటం స్థానికంగా విషాదం నింపింది. అనూష మృతికి కుటుంబ ఆర్థిక సమస్యలు కారణమా? గృహ కలహాలా? లేక మరేదైనా కారణమా? అన్నది పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.
Similar News
News October 2, 2025
ఈనెల 15 నుంచి స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ: జేసీ

ఈనెల 15న రేషన్ షాప్ డీలర్ల వద్ద స్మార్ట్ రేషన్ కార్డులు పొందవచ్చని జేసీ డా.బి.నవ్య వెల్లడించారు. 16వ తేదీ నుంచి సచివాలయ ఉద్యోగులు స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేస్తారన్నారు. బుధవారం కర్నూలులోని బుధవార పేటలో ఎఫ్‌సీ షాపులను తనిఖీ చేశారు. ఆమె మాట్లాడుతూ.. స్మార్ట్ రేషన్ కార్డులు ఉచితంగా పంపిణీ చేయాలన్నారు. ఎవరైనా రేషన్ డీలర్లు డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
News October 2, 2025
ప్రధాని పర్యటన నేపథ్యంలో పగడ్బందీగా ఏర్పాట్లు చేయండి: కలెక్టర్

ఈ నెల 16న ప్రధాని జిల్లాలో పర్యటించనున్నట్లు ప్రాథమికంగా సమాచారం అందిన నేపథ్యంలో పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అధికారులను కలెక్టర్ సిరి ఆదేశించారు. బుధవారం కర్నూలు కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారులతో ఆమె సమీక్షించారు. పర్యటనకు సంబంధించి ఇంకా అధికారికంగా షెడ్యూల్ విడుదల కాలేదన్నారు. నగరంలో 4,000 మందితో రోడ్ షో ఉండే అవకాశం ఉందన్నారు.
News October 2, 2025
ప్రధాని పర్యటన నేపథ్యంలో భద్రతా ఏర్పాట్ల పరిశీలన

ఈనెల 16న ప్రధాని నరేంద్ర మోదీ కర్నూలుకు వస్తున్నందున భద్రతా ఏర్పాట్లకు సంబంధించి ఎస్పీ విక్రాంత్ పాటిల్ పోలీస్ అధికారులతో చర్చించి, పలు ప్రాంతాలను తనిఖీ చేశారు. నగరంలో జీఎస్టీ సంస్కరణలపై రోడ్డు షో నిర్వహిస్తున్నందున వాహనాల పార్కింగ్, హెలిపాడ్ ఏర్పాట్లను పరిశీలించారు. సిల్వర్ జూబ్లీ కళాశాల, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, బి క్యాంప్, నంద్యాల చెక్ పోస్ట్ ప్రాంతాలను పరిశీలించారు.