News November 11, 2025
కర్నూలు జిల్లాలో గవర్నర్ అబ్దుల్ నజీర్ పర్యటన షెడ్యూల్..!

ఈ నెల 12న గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకి విజయవాడ ఎయిర్‌పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరుతారు. 10.30కి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు. 11 నుంచి నుంచి మధ్యాహ్నం 12.15 వరకు జరిగే RU నాలుగో కన్వొకేషన్ కార్యక్రమంలో పాల్గొంటారు. సా. 4.10కు కర్నూలు నుంచి బయలుదేరి 4.40కు విజయవాడ గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు.
Similar News
News November 11, 2025
యాపిల్ కొత్త ఫీచర్.. నెట్‌వర్క్ లేకున్నా మ్యాప్స్, మెసేజెస్!

మొబైల్ నెట్‌వర్క్ అందుబాటులో లేకున్నా మ్యాప్స్, మెసేజ్‌లు పనిచేసే ఫీచర్లను అందుబాటులోకి తెచ్చేందుకు యాపిల్ ప్రయత్నిస్తోందని బ్లూమ్‌బర్గ్ ఒక రిపోర్టులో తెలిపింది. యాపిల్‌కు చెందిన ఇంటర్నల్ శాటిలైట్ కనెక్టివిటీ గ్రూప్ ఇప్పటికే గ్లోబల్‌స్టార్ నెట్‌వర్క్‌తో కలిసి పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. శాటిలైట్ ద్వారా పనిచేసే ఎమర్జెన్సీ SOS ఫీచర్‌ను 2022లో విడుదల చేసిన iPhone14లోనే అందుబాటులోకి తెచ్చింది.
News November 11, 2025
కడప విమానాశ్రయంలో భద్రతా ఏర్పాట్లపై సమీక్ష

సీఎం చంద్రబాబు చిన్నమండెం పర్యటన నేపథ్యంలో కడప విమానాశ్రయంలో భద్రతా ఏర్పాట్లపై జిల్లా SP షెల్కే నచికేత్ విశ్వనాథ్ మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఎయిర్‌పోర్ట్‌లో చేపట్టాల్సిన భద్రతా చర్యలపై అడ్వాన్స్ సెక్యూరిటీ లైజన్ (A.S.L) సమావేశం జరిగింది. ఈ సందర్భంగా SP పోలీసు శాఖతోపాటు ఇతర విభాగాల అధికారులకు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని, అప్రమత్తంగా విధులు నిర్వర్తించాలని సూచించారు.
News November 11, 2025
రాష్ట్ర ఉత్సవంగా జగన్న తోట ప్రబల తీర్థం..!

అంబేడ్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలంలో జగ్గన్న తోట ప్రభలతీర్థానికి ఎంతో పేరుంది. కనుమ రోజు 11 గ్రామాల నుంచి ఊరేగింపుగా ప్రభలు తీసుకొస్తారు. ఈ అపురూపమైన దృశ్యాలను చూడటానికి వేలాది మంది వస్తారు. దీంతో ప్రబల తీర్థాన్ని రాష్ట్ర ఉత్సవంగా ప్రకటించాలనే డిమాండ్ ఉంది. ఇదే విషయమై CM చంద్రబాబును టీడీపీ నాయకురాలు తేజస్వి పొడపాటి కలిసి వినతిపత్రం ఇచ్చారు. త్వరలోనే అధికారికంగా శుభవార్త వస్తాదని ఆమె చెప్పారు.


