News April 28, 2024
కర్నూలు జిల్లాలో చంద్రబాబు నేటి పర్యటన షెడ్యూల్ ఇదే..!

టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 3.45 గంటలకు హెలికాఫ్టర్‌లో కౌతాళంలోని జెడ్పీ హైస్కూల్ గ్రౌండ్‌కు చేరుకుంటారు. సాయంత్రం 4 నుంచి 5.30 గంటల వరకు బస్టాండ్ సెంటర్‌లో ప్రసంగిస్తారు. సాయంత్రం 6.10 గంటలకు గూడూరుకు చేరుకుని బస్టాండ్ సర్కిల్‌లో 6.30 నుంచి రాత్రి 8 గంటల వరకు సభలో మాట్లాడతారు. రాత్రికి గూడూరులోనే బస చేస్తారు.
Similar News
News September 30, 2025
రోడ్డు ప్రమాద ఘటనపై మంత్రి టీజీ భరత్ దిగ్భ్రాంతి

కర్నూలు జిల్లా పత్తికొండలో జరిగిన రోడ్డు ప్రమాద ఘటనపై మంత్రి టీజీ భరత్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదంలో ముగ్గురు చనిపోవడం ఎంతో బాధ కలిగించిందని ఓ ప్రకటనలో తెలిపారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు.
News September 30, 2025
దేవరగట్టు బన్నీ ఉత్సవాలకు ప్రతిష్ఠ బందోబస్తు: ఎస్పీ

దసరా పండుగను పురస్కరించుకుని వచ్చే నెల 2న (గురువారం) దేవరగట్టు శ్రీ మాళమల్లేశ్వర స్వామి బన్నీ ఉత్సవం శాంతియుతంగా, ఆచార సంప్రదాయాలకు అనుగుణంగా జరగాలని కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ విజ్ఞప్తి చేశారు. భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశామన్నారు. బన్నీ ఉత్సవం సందర్భంగా ఏవైనా అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా 800 మంది పోలీసులతో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశామని వెల్లడించారు.
News September 30, 2025
కల్లూరు: కారు ఢీకొని 33 గొర్రెలు, కాపరి మృతి

కర్నూలు జిల్లా కల్లూరు మండలం బస్తిపాడు గ్రామానికి చెందిన కురువ ఎల్ల రాముడు (33) కారు ఢీకొని మృతి చెందాడు. ఉలిందకొండ నేషనల్ హైవేలో గొర్రెలను రోడ్డు దాటిస్తుండగా కర్నూల్ నుంచి వేగంగా వస్తున్న కారు గొర్రెల మందపైకి దూసుకెళ్లింది. 33 గొర్రెలతో సహా కాపరి అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడికి నలుగురు ఆడపిల్లలు ఉన్నట్లు స్థానికులు తెలిపారు.