News March 30, 2025

కర్నూలు జిల్లాలో చికెన్ ధర రూ.200

image

కర్నూలు జిల్లాలో పలు చోట్ల చికెన్ ధర రూ.200 నుంచి రూ.220 వరకు పలుకుతోంది. కర్నూలు, ఆదోని, ఎమ్మిగనూరు, పత్తికొండ, తదితర ప్రాంతాల్లో లైవ్ కోడి కిలో రూ.120 ఉండగా.. స్కిన్‌ రూ.180, స్కిన్ లెస్ రూ.200 చొప్పున విక్రయిస్తున్నారు. 2 నెలల క్రితం రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ కలకలం నేపథ్యంలో చికెన్ అమ్మకాలు తగ్గి, మటన్, చేపల విక్రయాలు పెరిగాయి. దీంతో కిలో మటన్ రూ.900, చేపలు రూ.300 చొప్పున అమ్ముతున్నారు.

Similar News

News April 1, 2025

కర్నూలు: పరీక్షా కేంద్రంలో కలెక్టర్ తనిఖీ

image

పదో తరగతి పరీక్షల్లో భాగంగా మంగళవారం జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా కర్నూలు నగరంలోని దామోదరం సంజీవయ్య, స్మారక మున్సిపల్ హై స్కూల్ పరీక్షా కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ రంజిత్ బాషా మాట్లాడుతూ.. విద్యార్థులకు మెరుగైన సదుపాయాలను కల్పించడంలో అధికారులు సఫలమయ్యారని అన్నారు. ఎలాంటి లోటుపాట్లు లేకుండా అధికారులు చూసుకోవాలని ఆదేశించారు.

News April 1, 2025

కర్నూలు జిల్లాలో 54.35% పింఛన్ల పంపిణీ@9Am.!

image

కర్నూలు జిల్లాలో ఏప్రిల్ నెలకు సంబంధించి మంగళవారం ఎన్టీఆర్ భరోసా పథకం కింద సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. ప్రభుత్వం ఆదేశాలతో ఉదయం 7 గంటల నుంచే ఈ కార్యక్రమం ప్రారంభం కాగా.. ఉదయం 9 గంటలకు జిల్లాలో 54.35% పింఛన్ల పంపిణీ పూర్తయింది. ఇప్పటివరకు జిల్లాలో 2,38,302 మందికి గానూ 1,29,522 మందికి సచివాలయ ఉద్యోగులు పింఛన్ సొమ్మును అందజేశారు.

News April 1, 2025

కర్నూలు జిల్లాలో 9 కరవు మండలాలు.!

image

రబీ సీజన్‌లో ప్రభుత్వం ప్రకటించిన కరవు మండలాల జాబితాలో కర్నూలు జిల్లాలో 9 మండలాలకు స్థానం లభించింది. 2024-25 రబీ సీజన్‌లో కరవు ప్రభావిత మండలాలను సోమవారం ప్రభుత్వం ప్రకటించింది. జిల్లాలో ఆస్పిరి, కల్లూరు, కర్నూలు రూరల్, కర్నూలు అర్బన్, మద్దికెర, ఓర్వకల్లు, గూడూరు, కోడుమూరు, వెల్దుర్తి మండలాలను తీవ్ర కరవు ప్రాంతంగా గుర్తించింది. మిగిలిన మండలాలకు ఈ జాబితాలో చోటు దక్కలేదు.

error: Content is protected !!