News September 30, 2024

కర్నూలు జిల్లాలో టమాటా ధర అదరహో

image

టమాటా రైతులకు కాసుల పంట పండుతోంది. కర్నూలు జిల్లాలో కిలో రూ.70 వరకు పలుకుతోంది. రైతుబజార్లలో కిలో రూ.30 నుంచి ₹44గా ఉంది. ప్రస్తుతం జిల్లాలో రోజుకు 600 టన్నుల వరకు దిగుబడి వస్తోంది. 25 కిలోల బాక్స్ ₹1400 వరకు పలుకుతోంది. పత్తికొండ, డోన్, ప్యాపిలి, ఆస్పరి, దేవనకొండ, క్రిష్ణగిరి, హొళగుంద, మద్దికెర, పెద్దకడబూరు, కల్లూరు తదితర మండలాల్లో ఈ పంటను సాగు చేశారు. జిల్లాలో సుమారు 10 వేల ఎకరాల్లో సాగులో ఉంది.

Similar News

News November 9, 2025

ఈనెల 11న సీఎం వర్చువల్ శంకుస్థాపనలు: కలెక్టర్

image

జిల్లాలో పలు ప్రాజెక్టులకు ఈ నెల 11న సీఎం చంద్రబాబు వర్చువల్‌గా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఇందుకు తగిన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ డా. ఏ. సిరి అధికారులను ఆదేశించారు. ఆదివారం ఆర్డీవోలు, ఏపీఐఐసీ, ఎయిర్‌పోర్ట్, టూరిజం అధికారులతో కలెక్టర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ముఖ్యమంత్రి లబ్ధిదారులు, స్టేక్‌హోల్డర్లతో నేరుగా మాట్లాడే అవకాశం ఉండేలా సక్రమ ఏర్పాట్లు చేయాలని సూచించారు.

News November 9, 2025

కర్నూలు జిల్లా విశ్వబ్రాహ్మణ మహిళా అధ్యక్షురాలిగా పద్మావతి

image

విశ్వబ్రాహ్మణ హక్కుల పోరాట సమితి కర్నూలు జిల్లా మహిళా అధ్యక్షురాలిగా ఎమ్మిగనూరు పట్టణానికి చెందిన పద్మావతి నియమితులయ్యారు. ఆదివారం పత్తికొండ పట్టణంలో విశ్వబ్రాహ్మణ హక్కుల పోరాట సమితి సమావేశం జరిగింది. ఇందులో విశ్వబ్రాహ్మణ హక్కుల పోరాట సమితి కర్నూలు జిల్లా మహిళా అధ్యక్షురాలిగా పద్మావతిని నియమిస్తూ నియామక పత్రాన్ని అందజేశారు. తనను ఎన్నుకున్న ప్రతి ఒక్కరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

News November 9, 2025

ఆన్లైన్ ట్రేడింగ్, ఇన్వెస్ట్మెంట్ మోసాలపై జాగ్రత్త: ఎస్పీ

image

ఆన్లైన్ ట్రేడింగ్, ఇన్వెస్ట్మెంట్ మోసాలపై జాగ్రత్త అని కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ సూచించారు. ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరు పెట్టి వచ్చే యాడ్స్, వాట్సాప్/ ఇన్‌స్టాగ్రామ్/ టెలిగ్రామ్ లింక్స్‌‌ను నమ్మవద్దు అన్నారు. తక్కువలో ఎక్కువ లాభాలు వచ్చే వాగ్దానాలు కచ్చితంగా మోసం చేసేందుకే అన్నారు. లింక్స్ క్లిక్ చేయొద్దని, అపరిచిత APK/ఫైళ్ళు ఇన్‌స్టాల్ చేయవద్దని, OTP, UPI PIN వంటివి చెప్పొద్దన్నారు.