News April 22, 2025

కర్నూలు జిల్లాలో ప్రమాదం.. తండ్రీ కూతుళ్లు మృతి

image

రోడ్డు ప్రమాదంలో తండ్రీ కూతుళ్లు మృతి చెందిన విషాద ఘటన కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. తండ్రి, కూతురు కలిసి బైక్‌పై వెళ్తుండగా ఆలూరు మండలం పెద్దహోతూరు వద్ద ఎదురుగా వచ్చిన లారీ ఢీకొనగా తండ్రీ కూతుళ్లు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు ఆస్పిరి మండలం ముత్తుకూరుకు చెందినవారిగా గుర్తించారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

Similar News

News September 29, 2025

కర్నూలు ఎస్పీ గ్రీవెన్స్ డేకు 79 ఫిర్యాదులు

image

కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ డేకు 79 ఫిర్యాదులు అందాయి. ఎస్పీ మాట్లాడుతూ.. ప్రజల నుంచి తీసుకున్న అర్జీలపై విచారణ జరిపి చట్టపరంగా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఎయిడెడ్ స్కూల్లో టీచర్, క్లర్క్ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి కర్నూలుకు చెందిన మాధప్ప రూ.14.50 లక్షలు తీసుకొని మోసం చేశాడని దొరస్వామి అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు.

News September 29, 2025

నెలకు రూ.వెయ్యి ఆదా: కర్నూలు కలెక్టర్

image

కర్నూలు: జీఎస్టీ పన్నుల తగ్గింపుతో ప్రజలకు కలిగే లాభాలను ప్రతి ఇంటికి చేరేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని కలెక్టర్ డా.ఏ.సిరి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో సూపర్ జీఎస్టీ–సూపర్ సేవింగ్స్ పోస్టర్లను సోమవారం ఆమె ఆవిష్కరించారు. జీఎస్టీ పన్నుల తగ్గింపుతో ప్రతి కుటుంబానికి నెలకు రూ.వెయ్యి వరకు ఆదా అవుతోందని తెలిపారు.

News September 29, 2025

రాయలసీమ: ఆర్.యు పీజీ సెమిస్టర్ ఫలితాలు విడుదల

image

రాయలసీమ యూనివర్సిటీ పీజీ రెండో సెమిస్టర్ ఫలితాలను ఆదివారం ఉపకులపతి ప్రొఫెసర్ వెంకట్రావు బసవరావు విడుదల చేశారు. పీ. జీ రెండవ సెమిస్టర్ లో 462 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 413 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు.
విద్యార్థులు ఫలితాలను రాయలసీమ యూనివర్సిటీ వెబ్సైట్ https://rayalaseemauniversity.ac.in లో చూసుకోవచ్చని తెలిపారు.