News September 24, 2024

కర్నూలు జిల్లాలో భారీగా MPDOల బదిలీ

image

ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా భారీగా ఎంపీడీవోలు బదిలీ అయ్యారు. ఒకేసారి 42 మంది ఎంపీడీవోలకు స్థానాలు కేటాయిస్తూ జెడ్పి సీఈవో నాసరరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో ముగ్గురు ఎంపీడీవోలను కడప జిల్లా నుంచి జిల్లాకు కేటాయించగా, మరో ఆరుగురు ఎంపీడీవోలను అనంతపురం జిల్లా నుంచి కర్నూలు జిల్లాకు కేటాయించారు.

Similar News

News January 10, 2025

రేపు కర్నూలుకు పవన్ కళ్యాణ్

image

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కర్నూలు జిల్లా పర్యటన ఖరారైంది. రేపు ఆయన జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 9.45 గంటలకు గన్నవరం నుంచి బయల్దేరి 11:30 గంటలకు కర్నూలు విమానాశ్రయానికి చేరుకుంటారు. అనంతరం గడివేముల మండలం గని వద్ద ఏర్పాటు చేసిన సోలార్ పార్క్, పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టు సైట్‌ను ఆయన ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించనున్నారు. సాయంత్కరం సాయంత్రం 4.50 గంటలకు తిరిగి విజయవాడకు వెళ్తారు.

News January 10, 2025

ప్రజలకు మెరుగైన సదుపాయాలు కల్పించాలి: మంత్రి బీసీ

image

బనగానపల్లెలోని ప్రజలకు మెరుగైన సదుపాయాలు కల్పించాలని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. బనగానపల్లె పంచాయతీ కార్యాలయంలో రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకుని తాగునీటి సమస్యతో పాటు పారిశుద్ధ్య అంశంపై సంబంధిత అధికారులతో శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. బనగానపల్లె వాసులకు పంచాయతీ ద్వారా మెరుగైన సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు.

News January 10, 2025

బీఈడీ 4వ సెమిస్టర్ ఫలితాలు విడుదల

image

కర్నూలు రాయలసీమ యూనివర్సిటీ (ఆర్‌యూ) పరిధిలో ఇటీవల నిర్వహించిన బీఈడీ 4వ సెమిస్టర్ పరీక్షల ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. వివరాలను యూనిర్సిటీ వెబ్‌సైట్‌లో ఉంచినట్లు ఇన్‌ఛార్జ్ వీసీ ఎన్టీకే నాయక్ తెలిపారు. 2,647 మంది విద్యార్థులు రెగ్యులర్ కింద పరీక్షలు రాయగా.. వారిలో 2,499 మంది పాసయ్యారు. సప్లిమెంటరీ కింద 370 మంది పరీక్షలు రాయగా.. 342 మంది ఉత్తీర్ణులయ్యారని ఆయన వెల్లడించారు.