News February 16, 2026
కర్నూలు జిల్లాలో యూరియా కొరత లేదు

కర్నూలు జిల్లాలో రబీ సీజన్‌కు అవసరమైన యూరియా సమృద్ధిగా అందుబాటులో ఉందని జిల్లా వ్యవసాయ అధికారి పీఎల్ వరలక్ష్మి తెలిపారు. ఇప్పటివరకు 18,168 మెట్రిక్ టన్నుల యూరియా విక్రయాలు జరిగాయని, ప్రస్తుతం 5,897 మెట్రిక్ టన్నుల నిల్వలు ఉన్నాయని చెప్పారు. ఎరువుల కొనుగోలు సమయంలో ఎంఆర్పీ ప్రకారం చెల్లించి, రశీదు తీసుకోవాలని రైతులకు సూచించారు.
Similar News
News February 17, 2026
పన్నుల వసూళ్లలో పురోగతి సాధించాలి: కలెక్టర్ ఆదేశం

ఆస్తి, నీటి పన్నుల వసూళ్లలో మున్సిపల్ అధికారులు మరింత పురోగతి సాధించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి ఆదేశించారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ట్రేడ్ లైసెన్సులు, భవన అనుమతులు, పెండింగ్ లేఅవుట్ పర్మిషన్లను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో కర్నూలు, ఎమ్మిగనూరు, ఆదోని, గూడూరు మున్సిపల్ కమిషనర్లు పాల్గొని తమ పరిధిలోని పురోగతిని వివరించారు.
News February 17, 2026
రమేశ్ కుటుంబానికి మందకృష్ణ మాదిగ పరామర్శ

తుగ్గలి మండలం బొందిమడుగులలో దారుణ హత్యకు గురైన రమేశ్ కుటుంబాన్ని మంగళవారం ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ పరామర్శించారు. దళిత నాయకుడి హత్యను ఖండిస్తూ నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఎస్సీ అట్రాసిటీ కేసు అమలు పరచాలని ప్రభుత్వాన్ని కోరారు. బాధితులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు పాల్గొన్నారు.
News February 17, 2026
కర్నూలులో 65 ఫిర్యాదుల స్వీకరణ

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో భాగంగా సోమవారం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో మొత్తం 65 ఫిర్యాదులు అందాయి. ఎస్పీ విక్రాంత్ పాటిల్ మాట్లాడుతూ.. వచ్చిన ప్రతీ ఫిర్యాదుపై చట్టపరంగా విచారణ జరిపి, బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. భూ ఆక్రమణ, ఉద్యోగ మోసాలు, లోన్ మోసాలు, బెదిరింపులపై పలు ఫిర్యాదులు నమోదయ్యాయి. కార్యక్రమంలో అదనపు ఎస్పీ హుస్సేన్ పీరా, సీఐలు పాల్గొన్నారు.


