News June 26, 2024

కర్నూలు జిల్లాలో వైసీపీ భవనాలకు నోటీసులు

image

కర్నూలు, ఆదోని పట్టణంలో నిర్మిస్తున్న వైసీపీ భవనాలకు అధికారులు నోటీసులు జారీ చేశారు. ఆయా కార్యాలయాలు అనుమతులు లేకుండా నిర్మిస్తున్నారని దీనిపై ఏడు రోజుల్లో వివరణ ఇవ్వాలని అందులో పేర్కొన్నారు. ఆదోని భవనానికి సంబంధించి వైసీపీ నాయకుడు ఎర్రిస్వామికి నోటీసులు ఇవ్వగా కర్నూలు నగరంలోని కార్యాలయానికి సంబంధించి వైసీపీ జిల్లా అధ్యక్షురాలు ఎస్‌.సత్యనారాయణమ్మకు అందజేశారు.

Similar News

News June 29, 2024

రూ.1,861 కోట్లను దోచేశారు: ఎంపీ బైరెడ్డి శబరి

image

ప్రజాధనం దుర్వినియోగం చేసిన దోషులను శిక్షించాలని ఎంపీ బైరెడ్డి శబరి ప్రభుత్వాన్ని కోరారు. ‘వైసీపీ పాలనలో ప్రజాధనం ఎంతలా దుర్వినియోగం అయిందో చెప్పేందుకు ఇదొక నిదర్శనం. మాజీ సీఎం జగన్ ప్రచార పిచ్చి కోసం ప్రత్యేకంగా డిజిటల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఏకంగా రూ.1,861 కోట్లను దోచేశారు. ఈ అక్రమాలన్నింటిపై సమగ్ర విచారణ జరిపి ప్రజాధనం దుర్వినియోగం చేసిన దోషులకు శిక్షించాలి’ అని ఆమె ట్వీట్ చేశారు.

News June 29, 2024

ALERT.. నంద్యాల జిల్లాలో నేడు పిడుగులతో కూడిన వర్షాలు

image

అల్పపీడన ద్రోణి ప్రభావంతో నేడు జిల్లాలో వర్షాలు పడతాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. నంద్యాల జిల్లాలోని పలు మండలాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయంది. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, చెట్లు, పోల్స్, టవర్స్ కింద ఉండొద్దని సూచించింది.

News June 29, 2024

విద్యార్థులకు పోషకాహార పదార్థాలను క్రమం తప్పకుండా ఇవ్వాలి: కలెక్టర్

image

పాణ్యం మండలం కౌలూరు గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె. శ్రీనివాసులు ఆకస్మికంగా పర్యవేక్షించారు. కేంద్రంలోని హాజరు అయిన విద్యార్థులు, హాజరు పట్టీని, ఇతర రిజిస్టర్లను పరిశీలిస్తూ వివరాలు అడిగి తెలుసుకున్నారు. బరువు తక్కువగా ఉన్న పిల్లలు, గర్భిణులు, బాలింతలకు ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం పోషకాహార పదార్థాలను క్రమం తప్పకుండా ఇవ్వాలని సిబ్బందిని ఆదేశించారు.