News August 15, 2025
కర్నూలు జిల్లాలో 276 బస్సుల్లో మహిళలకు ఫ్రీ జర్నీ

మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణానికి సర్వం సిద్ధమైంది. స్త్రీ శక్తి పథకాన్ని నేడు సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు. కర్నూలు జిల్లాలో 186 పల్లె వెలుగు, 2 అల్ట్రా పల్లె వెలుగు, 82 ఎక్స్‌ప్రెస్ బస్సులను ఉచిత ప్రయాణం కోసం ఉపయోగిస్తున్నట్లు ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా 390 బస్సులకు గానూ 276 ఉచిత బస్సులకు అనుమతి ఇచ్చినట్లు పేర్కొన్నారు.
Similar News
News August 15, 2025
కర్నూలులో ట్రాఫిక్ సమస్య ఉండొద్దు: మంత్రి

కర్నూలులో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని మంత్రి టీజీ భరత్ అధికారులను ఆదేశించారు. పాతబస్తీలో వన్ సైడ్ పార్కింగ్, ఆటోల కోసం ప్రత్యేక మార్కింగ్ ఏర్పాటు చేయాలని సూచించారు. ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న ప్రాంతాలను రెడ్‌జోన్‌గా గుర్తించి ప్రత్యేక చర్యలు చేపట్టాలని, ఆర్టీసీ బస్సులు నగరంలోకి ప్రవేశించకుండా బయటి మార్గాల ద్వారా వెళ్లేలా చూడాలని పేర్కొన్నారు.
News August 14, 2025
కర్నూలు ఐపీఎస్ అధికారికి రాష్ట్రపతి మెడల్

కర్నూలుకు చెందిన 2014 బ్యాచ్ ఐపీఎస్ అధికారి డా.జీవీ సందీప్ చక్రవర్తి 6వ రాష్ట్రపతి పోలీస్ మెడల్ ఫర్ గ్యాలంటరీకి ఎంపికయ్యారు. రేపు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఆయన అవార్డు అందుకోనున్నారు. ప్రస్తుతం ఆయన శ్రీనగర్ ఎస్ఎస్పీగా సెంట్రల్ క్యాడర్‌లో పనిచేస్తున్నారు.
News August 14, 2025
స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు: ఏఎస్పీ

కర్నూలులో శుక్రవారం నిర్వహిస్తున్న పంద్రాగస్టు వేడుకలకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఏఆర్ అడిషనల్ ఎస్పీ కృష్ణమోహన్ వెల్లడించారు. గురువారం ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు పోలీస్ పరేడ్ మైదానంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు సంబంధించిన రిహార్సల్‌ను ఆయన పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు.