News March 1, 2025

కర్నూలు జిల్లాలో 611 మంది విద్యార్థుల గైర్హాజరు

image

కర్నూలు జిల్లా వ్యాప్తంగా 69 పరీక్షా కేంద్రాల్లో ఇంటర్‌ ఫస్టియర్ విద్యార్థులకు పేపర్‌ 1 సెకండ్ లాంగ్వేజ్‌ పరీక్ష జరిగింది. ఈ పరీక్షకు 611 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు ప్రాంతీయ ఇంటర్మీడియట్ అధికారి గురువయ్య శెట్టి తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 23,755 విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 23,144 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఎలాంటి మాల్ ప్రాక్టీస్ ఘటనలు చోటు చేసుకోలేదని ఆయన వివరించారు.

Similar News

News March 1, 2025

కర్నూలు జిల్లాలో ఇంటర్ పరీక్షలు ప్రారంభం

image

కర్నూలు జిల్లా వ్యాప్తంగా 69 పరీక్షా కేంద్రాలలో ఇంటర్మీడియట్ పరీక్షలు శనివారం ప్రారంభమయ్యాయి. ఉదయం 8 గంటలకే విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. 8.30 నుంచి చెక్ చేసి లోపలికి అనుమతించారు. ఇవాళ ఇంటర్‌ ఫస్టియర్ విద్యార్థులకు పేపర్‌ 1 సెకండ్ లాంగ్వేజ్‌ పరీక్ష జరుగుతోంది. కర్నూల్ నగర వ్యాప్తంగా 32 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు.

News March 1, 2025

విద్యార్థులపై కూలిన వృక్షం.. ఏడుగురికి గాయాలు

image

కర్నూలు జిల్లా సి.బెళగల్ మండలం పోలకల్ గ్రామంలో సైన్స్ దినోత్సవంలో అపశ్రుతి చోటుచేసుకుంది. జిల్లా పరిషత్ హైస్కూల్‌లో శుక్రవారం సాయంత్రం ఓ భారీ వృక్షం కూలి విద్యార్థులపై పడింది. ఈ ఘటనలో ఏడుగురు విద్యార్థినులు గాయపడ్డారు. వారికి స్థానికంగా ప్రథమ చికిత్స అందించిన అనంతరం కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనపై ఎంపీడీవో రాణెమ్మ ఆరా తీశారు. ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు.

News March 1, 2025

కర్నూలు జిల్లాలో నేటి నుంచి ఇంటర్ పరీక్షలు

image

కర్నూలు జిల్లాలో నేటి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇవాళ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు ఉ.9 నుంచి మ.12 వరకు పేపర్-1 సెకండ్ లాంగ్వేజ్ పరీక్ష జరగనుంది. జిల్లాలోని 69 పరీక్ష కేంద్రాల్లో.. మొత్తంగా 23,098 మంది ఫస్ట్ ఇయర్ విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. కాగా పరీక్షల నిర్వహణకు 950 మంది ఇన్విజిలేటర్లను జిల్లా ఇంటర్ బోర్డు అధికారులు నియమించారు.☞ విద్యార్థులకు ALL THE BEST

error: Content is protected !!