News March 21, 2025
కర్నూలు జిల్లా అభివృద్ధికి నిర్దేశించిన లక్ష్యాలను సాధించాలి: కలెక్టర్

రాష్ర్ట ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా జిల్లా అభివృద్ధికి నిర్దేశించిన లక్ష్యాలను సాధించే విధంగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా జిల్లా అధికారులను ఆదేశించారు. ఈ నెల 25, 26 తేదీల్లో ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహించనున్న నేపథ్యంలో గురువారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో ముఖ్యమైన అన్ని శాఖల జిల్లా అధికారులతో అభివృద్ధి కార్యక్రమాల అమలు, పురోగతిపై కలెక్టర్ చర్చించారు.
Similar News
News March 21, 2025
ఉమ్మడి జిల్లా ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 13కు వాయిదా

2025-2026 విద్యా సంవత్సరంలో ఉమ్మడి జిల్లా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాల, కళాశాలల 5వ తరగతి, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 4 నుంచి ఏప్రిల్ 13వ తేదీకి వాయిదా వేసినట్లు ఉమ్మడి జిల్లా కో-ఆర్డినేటర్ డాక్టర్ ఐ.శ్రీదేవి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్ష తేదీలు ఏప్రిల్ 13న 5వ తరగతికి ఉదయం 9-12 గంటల వరకు, ఇంటర్మీడియట్ మధ్యాహ్నం 2 -4:30 గంటల వరకు ఉంటాయని పేర్కొన్నారు.
News March 21, 2025
మంత్రి ఫరూక్ సతీమణి మృతి.. సీఎం, డిప్యూటీ సీఎం సంతాపం

మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ సతీమణి షహనాజ్ మృతికి సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం వపన్ కళ్యాణ్ సంతాపం తెలిపారు. షహనాజ్ మృతితో విషాదంలో ఉన్న ఫరూక్ కుటుంబానికి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి సానుభూతిని తెలిపారు. కాగా, కొన్ని నెలలుగా అనారోగ్యంతో ఉన్న ఆమె ఇవాళ హైదరాబాద్‌లోని వారి నివాసంలో మృతిచెందారు.
News March 21, 2025
కర్నూలులో TDP నేత దారుణ హత్య.. వివరాలు వెల్లడించిన ఎస్పీ

రెండు కుటుంబాల మధ్య పాత కక్షలు, వర్గ పోరుతోనే TDP నేత సంజన్నను హత్య చేశారని SP విక్రాంత్ పాటిల్ వెల్లడించారు. కర్నూలులోని శరీన్ నగర్లో ఈనెల 14న సంజన్న హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ కేసులో ఐదుగురు నిందితులను అరెస్టు చేశామని ఎస్పీ తెలిపారు. అరెస్టయిన వారిలో వడ్డే ఆంజనేయులు, శివకుమార్, తులసి, రేవంత్, అశోక్ ఉన్నారని పేర్కొన్నారు. హత్యకు ఉపయోగించిన ఆయుధాలు, కార్లు, ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు.